బుమ్రా గాయంపై ఆందోళన అనవసరం: బీసీసీఐ | No need to worry about the Bumra injury: BCCI | Sakshi
Sakshi News home page

బుమ్రా గాయంపై ఆందోళన అనవసరం: బీసీసీఐ

Mar 26 2019 1:29 AM | Updated on Mar 26 2019 1:29 AM

No need to worry about the Bumra injury: BCCI - Sakshi

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా గాయపడిన భారత పేసర్‌ బుమ్రా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీసీసీఐ ప్రకటించింది. ఫీల్డింగ్‌ చేస్తూ కిందపడటంతో బుమ్రా ఎడమ భుజానికి గాయమైంది. సోమవారం నిర్వహించిన వైద్య పరీక్షల అనంతరం బుమ్రా గాయం చిన్నదేనని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

స్కానింగ్‌ రిపోర్ట్‌ కూడా మామూలుగానే ఉందని పేర్కొన్నారు. తదుపరి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మ్యాచ్‌ కోసం ముంబై జట్టు ఇప్పటికే బెంగళూరు చేరగా... బుమ్రా కూడా జట్టుతో కలుస్తాడని వెల్లడించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement