వాట్లింగ్‌ అజేయ సెంచరీ

New Zealand vs England 1st Test Day 3  - Sakshi

న్యూజిలాండ్‌కు ఆధిక్యం  

మౌంట్‌ మాంగని (న్యూజిలాండ్‌): ప్రత్యర్థి గాడితప్పిన బౌలింగ్‌ను సద్వినియోగం చేసుకున్న న్యూజిలాండ్‌ వికెట్‌ కీపర్‌ వాట్లింగ్‌ స్ఫూర్తిదాయక శతకం (119 బ్యాటింగ్‌; 15 ఫోర్లు)తో జట్టును ఆదుకున్నాడు. దీంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 394 పరుగులు చేసింది. 41 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. వాట్లింగ్‌తోపాటు సాన్‌ట్నెర్‌ (31 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. అంతకుముందు 144/4తో మూడో రోజు ఆట ఆరంభించిన న్యూజిలాండ్‌ను వాట్లింగ్‌... నికోల్స్‌ (41; 5 ఫోర్లు), గ్రాండ్‌హోమ్‌ (65; 7 ఫోర్లు, సిక్స్‌) ఆదుకున్నారు. మూడో రోజు 90 ఓవర్లు వేసిన ఇంగ్లండ్‌ బౌలర్లు  2 వికెట్లను మాత్రమే తీశారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top