హ్యాట్రిక్‌పై న్యూజిలాండ్‌ గురి | New Zealand at the top of the table with a better run rate | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్‌పై న్యూజిలాండ్‌ గురి

Jun 8 2019 5:24 AM | Updated on Jun 8 2019 8:30 AM

New Zealand at the top of the table with a better run rate - Sakshi

టాంటన్‌: రెండు విజయాలు, నాలుగు పాయింట్లు, మెరుగైన రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న న్యూజిలాండ్‌... రెండు పరాజయాలు, సున్నా పాయింట్లు, మైనస్‌ రన్‌రేట్‌తో అట్టడుగున ఉన్న అఫ్గానిస్తాన్‌ మధ్య శనివారం టాంటన్‌లో ప్రపంచ కప్‌ మ్యాచ్‌ జరుగనుంది. లంకపై ఘన విజ యంతో టోర్నీని ప్రారంభించిన కివీస్‌... బంగ్లాపై మాత్రం చెమటోడ్చింది. మరోవైపు ఒకటి రెండైనా సంచలనాలు సృష్టిస్తుందని అంచనాలున్న గుల్బదిన్‌ నైబ్‌ బృందం... శ్రీలంకకు తేలిగ్గా తలొంచింది. ఆస్ట్రేలియాపైనే కాస్త పోరాడింది.

బౌలింగ్‌ బలంగా ఉన్నా, బ్యాటింగ్‌లో మంచి ఇన్నింగ్స్‌లు లేకపోవడంతో అఫ్గాన్‌ ఏమీ చేయలేకపోతోంది. దీనికితోడు వికెట్‌ కీపర్‌ మొహమ్మద్‌ షెహజాద్‌ గాయంతో ప్రపంచకప్‌కే దూరమవడం వారికి దెబ్బే. స్పిన్‌ను సమర్థంగా ఆడే రాస్‌ టేలర్‌ కివీస్‌కు పెద్ద భరోసా. అఫ్గాన్‌ బౌలర్ల దెబ్బకు మిగతా బ్యాట్స్‌మెన్‌ తడబడినా టేలర్, కెప్టెన్‌ విలియమ్సన్‌ ఇన్నింగ్స్‌ను నిర్మించగలరు. అయితే, మిస్టరీ స్పిన్నర్లున్న అఫ్గాన్‌... ప్రత్యర్థిని ఇబ్బందిపెట్టినా ఆశ్చర్యం లేదు. పేస్‌కు కొంత అనుకూలించినా స్ట్రయిట్‌ బౌండరీలు చిన్నవి కావడంతో టాంటన్‌ మైదానం భారీ స్కోర్లకు పేరుగాంచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement