
రెండో వన్డే వర్షార్పణం
ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య గురువారం ఇక్కడ జరగాల్సిన ఉన్న రెండో వన్డే వర్షం కారణంగా రద్దయ్యింది.
నేపియర్: ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య గురువారం ఇక్కడ జరగాల్సిన ఉన్న రెండో వన్డే వర్షం కారణంగా రద్దయ్యింది. భారీగా కురిసిన వర్షానికి అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారిపోవడంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. తొలుత మ్యాచ్ను 37 ఓవర్లకు కుదించేందుకు అంపైర్లు మొగ్గు చూపినా.. అవుట్ ఫీల్డ్ మాత్రం ఆరలేదు. దాంతో మ్యాచ్ ను నిర్వహించే అవకాశం కుదరలేదు. కనీసం బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దు కావడంతో అభిమానులు నిరాశ చెందారు.
తదుపరి వన్డే ఆదివారం హామిల్టన్ లో జరుగనుంది. ఆ మ్యాచ్లో గెలుపుతో సిరీస్ ఫలితం నిర్ణయించబడుతుంది. ఇప్పటికే న్యూజిలాండ్ తొలి వన్డేలో గెలిచి ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో ఆ జట్టు సిరీస్ పై కన్నేసింది. ఒకవేళ ఆసీస్ గెలిస్తే సిరీస్ సిరీస్ సమం అవుతుంది.