సంబరాలు చేసుకుందాం రండి | Mumbai Indians to celebrate IPL victory at Wankhede | Sakshi
Sakshi News home page

సంబరాలు చేసుకుందాం రండి

May 25 2015 2:29 PM | Updated on Sep 3 2017 2:40 AM

సంబరాలు చేసుకుందాం రండి

సంబరాలు చేసుకుందాం రండి

రెండోసారి ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ టీమ్ సొంతగడ్డపై సంబరాలకు రెడీ అయింది.

ముంబై: రెండోసారి ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ టీమ్ సొంతగడ్డపై సంబరాలకు రెడీ అయింది. టైటిల్ గెలిచి జోష్ మీదున్న రోహిత్ సేన సోమవారం రాత్రి వాంఖేడ్ స్టేడియంలో సంబరాలు చేసుకోనుంది. వేడుకల్లో పాల్గొనాలని అభిమానులను కోరింది. రాత్రి 8 గంటలు సంబరాలు ప్రారంభమవుతాయి.

ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులు, టీమ్ మెంటార్ సచిన్ టెండూల్కర్, అతడి కుటుంబ సభ్యులు, సహ యాజమాని నీతా అంబానీ పాల్గొంటారు. కోల్ కతా నుంచి రోహిత్ సేన సోమవారం సాయంత్రానికి ముంబై చేరుకుంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. సంబరాలు వీక్షించేందుకు వచ్చే అభిమానులను ఉచితంగా వాంఖేడ్ స్టేడియంలోకి అనుమతిస్తారు. ముందు వచ్చిన వారికి ప్రయారిటీ ఇస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement