మహ్మద్‌ షమీకి యూఎస్‌ వీసా నిరాకరణ | Mohammed Shamis US visa rejected initially | Sakshi
Sakshi News home page

మహ్మద్‌ షమీకి యూఎస్‌ వీసా నిరాకరణ

Jul 27 2019 11:43 AM | Updated on Jul 27 2019 2:06 PM

Mohammed Shamis US visa rejected initially - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా ఫాస్ట్ బౌలర్ అయిన మహ్మద్ షమీకి అమెరికా వీసాను తిరస్కరించిన ఘటన తాజాగా వెలుగుచూసింది. షమీపై పలు కేసులు విచారణలో ఉన్నందు వల్ల వీసా ఇవ్వడానికి అమెరికా రాయబార కార్యాలయం నిరాకరించింది. 2018వ సంవత్సరంలో షమీ భార్య హాసిన్ జహాన్ అతనిపై గృహహింస కేసు పెట్టింది. హాసిన్ జహాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోల్‌కతా పోలీసులు షమీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  దాంతో షమీపై కేసులు విచారణలో ఉన్నాయి.

ఆ క్రమంలోనే షమీ యూఎస్‌ వీసాను నిరాకరించారు. కాగా,  భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ జోహ్రీ వెంటనే స్పందించి అమెరికా రాయబార కార్యాలయానికి లేఖ రాశారు. భారత క్రికెటర్ అయిన మహ్మద్ షమీ ప్రపంచ కప్‌తోపాటు పలు క్రికెట్ టోర్నీల్లో పాల్గొని విజయాలు సాధించాడని, అతనికి పీ వన్ కేటగిరి కింద అంతర్జాతీయ క్రీడాకారుడిగా గుర్తించి వీసా జారీ చేయాలని బీసీసీఐ సీఈవో కోరారు. దీంతో అమెరికా షమీకి ఎట్టకేలకు వీసా జారీ చేసినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement