'చీరలో చాలా ముద్దొస్తున్నావు తల్లి' | Mohammed Shami Showers Love On Daughter Saree Picture | Sakshi
Sakshi News home page

చీరలో చాలా ముద్దొస్తున్నావు తల్లి : షమీ

Jan 31 2020 8:52 AM | Updated on Jan 31 2020 9:33 AM

Mohammed Shami Showers Love On Daughter Saree Picture - Sakshi

వెల్లింగ్టన్‌ : టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ తన కూతురును చూసి తెగ మురిసిపోతున్నాడు. ఇంతకి అతడు అంతలా మురిసిపోవడానికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నారా.. ఏం లేదండి.. షమీ కూతురు ఐరా షమీ ఎల్లో కలర్‌ చీరను ధరించిన ఫోటోను తన నాన్నకు వాట్సప్‌లో షేర్‌ చేసింది. తన కూతురు చీరలో ఉన్న ఫోటోను చూసిన షమీ వెంటనే దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. 'ఈ చీరలో చాలా అందంగా కనపడుతున్నావు, ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది తల్లి...నిన్ను చాలా మిస్సవుతున్నా..త్వరలోనే నిన్ను కలుస్తానంటూ'  క్యాప్షన్‌ కూడా జతచేశాడు. (‘సూపర్‌’ మ్యాచ్‌: గెలిపించినోడే హీరో)

ప్రసుత్తం షమీ న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికై ఐదు టీ20 మ్యాచ్‌ల్లో టీమిండియా 3-0 ఆధిక్యంలో నిలిచి సిరీస్‌ను గెలుచుకుంది. కాగా మూడో టీ 20లో బుమ్రా విఫలమైన షమీ మాత్రం తన చివరి ఓవర్లో చివరి బంతికి రాస్‌ టేలర్‌ను బౌల్డ్‌ చేసి న్యూజిలాండ్‌ గెలవాల్సిన మ్యాచ్‌ను టైగా ముగించడంలో కీలకపాత్ర పోషించాడు. తర్వాత మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారితీయడం.. టీమిండియా గెలవడం చకచకా జరిగిపోయాయి. టీమిండియా, న్యూజిలాండ్‌ మధ్య నాలుగో టీ20 వెల్లింగ్టన్‌ వేదికగా మరికొన్ని గంటల్లో జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement