షుమాకర్ ఇంటికి | Michael Schumacher returns home from hospital, 254 days after skiing accident that left him in a coma | Sakshi
Sakshi News home page

షుమాకర్ ఇంటికి

Sep 10 2014 1:39 AM | Updated on Sep 2 2017 1:07 PM

షుమాకర్ ఇంటికి

షుమాకర్ ఇంటికి

స్కీయింగ్ ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్‌ను స్విస్ ఆసుప్రతి నుంచి ఇంటికి తరలించారు.

జెనీవా: స్కీయింగ్ ప్రమా దంలో గాయపడి కోలుకుంటున్న ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్‌ను స్విస్ ఆసుప్రతి నుంచి ఇంటికి తరలించారు. ఇంటి దగ్గరే అతనికి అవసరమైన చికిత్సను అందజేస్తున్నట్లు కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. ‘షుమాకర్‌కు పునరావాస చికిత్స అందుతోంది. అతనిలో గత కొన్ని నెలలుగా పురోగతి కనిపిస్తోంది. అయితే ఇంకా కోలుకోవాల్సి ఉంది. షుమీ కుటుంబ విషయాలను గోప్యంగా ఉంచాలని కోరుకుంటున్నాం.  అతని ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న ఊహాగానాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని షూమీ అధికార ప్రతినిధి సబీనా కెమ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement