భారత్-ఇంగ్లండ్ ల తొలి వన్డే రద్దు | Match abandoned without a ball bowled | Sakshi
Sakshi News home page

భారత్-ఇంగ్లండ్ ల తొలి వన్డే రద్దు

Aug 25 2014 6:40 PM | Updated on Sep 2 2017 12:26 PM

భారత్-ఇంగ్లండ్ ల తొలి వన్డే రద్దు

భారత్-ఇంగ్లండ్ ల తొలి వన్డే రద్దు

భారత్-ఇంగ్లండ్ ల మధ్య జరుగనున్న తొలి వన్డే మ్యాచ్ రద్దయింది.

బ్రిస్టల్: భారత్-ఇంగ్లండ్ ల మధ్య జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్ రద్దయింది. సోమవారం ఇరుజట్లు తొలిపోరుకు సిద్ధమైనా.. వరుణుడు మాత్రం కరుణించలేదు. ఇక్కడ ఎడతెరిపి లేకుండా  వర్షం కురవడంతో మ్యాచ్ ను రద్దు చేయక తప్పలేదు.  ఒక్క బంతికూడా పడకుండానే మ్యాచ్ రద్దు కావడంతో క్రికెట్ అభిమానులకు తీవ్ర నిరాశ చెందారు. టెస్టు సిరీస్ నెగ్గిన జోరులో ఉన్న ఇంగ్లండ్ వన్డే సిరీస్‌పై కూడా కన్నేసింది. అయితే గతంలో సొంతగడ్డపై జరిగిన రెండు వన్డే సిరీస్‌లను  కోల్పోయింది. పేస్ ఆల్‌రౌండర్లను ఈ మ్యాచ్ ద్వారా పరిశీలించాలని భావించిన ఇంగ్లండ్ కు వర్షం కారణంగా ఆ ఆశలు తీరలేదు.

 

ఈ మ్యాచ్ కు టెస్ట్ మ్యాచ్ హీరో మొయిన్ అలీని పక్కన పెట్టి తమ పేస్ బౌలింగ్ ను పరీక్షించాలని ఇంగ్లండ్ భావించింది.ఇంగ్లండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ను గెలిచి ఆశాజనకంగా ఆరంభిద్దామని భావించిన టీమిండియా ఆశలు కూడా నెరవేరలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement