
సిడ్నీ: టెస్టుల్లో సూపర్ ఫామ్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ఆ్రస్టేలియా వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ మార్నస్‌లబ్ షేన్ కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీని (363 బంతుల్లో 215; 19 ఫోర్లు, సిక్స్) నమోదు చేశాడు. దీంతో ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో ద్విశతకం బాదిన 37వ ఆటగాడిగా లబ్ షేన్ నిలిచాడు. న్యూజిలాండ్‌తో ఇక్కడి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతోన్న మూడో టెస్టు రెండో రోజు అతడు ఈ ఘనతను అందుకున్నాడు. ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 130 పరుగులతో శనివారం బ్యాటింగ్ కొనసాగించిన లబ్ షేన్ ఎక్కడా తడబడకుండా ఆడాడు.
వ్యక్తిగత స్కోరు 199 వద్ద దాదాపు 20 నిమిషాల పాటు సహనంతో బ్యాటింగ్ చేసిన లబ్ షేన్... గ్రాండ్ హోమ్ వేసిన 134వ ఓవర్ మూడో బంతి అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకుంటూ బౌండరీ చేరడంతో డబుల్ సెంచరీ మైలురాయిని అందుకున్నాడు. ఇతర బ్యాట్‌మెన్ విఫలమవ్వడంతో ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 454 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ తమ చివరి 5 వికెట్లను 44 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. గ్రాండ్‌హోమ్, వ్యాగ్నర్ చెరో మూడు వికెట్లతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 63 పరుగులు చేసింది. టామ్ లాథమ్ (26 బ్యాటింగ్; 2 ఫోర్లు), బ్లండెల్ (34 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం కివీస్ 391 పరుగులు వెనుకబడి ఉంది.