హామిల్టన్ ఎనిమిదోసారి... | Lewis Hamilton on Malaysian Grand Prix pole position | Sakshi
Sakshi News home page

హామిల్టన్ ఎనిమిదోసారి...

Oct 2 2016 1:37 AM | Updated on Jun 4 2019 5:16 PM

హామిల్టన్ ఎనిమిదోసారి... - Sakshi

హామిల్టన్ ఎనిమిదోసారి...

గత మూడు రేసుల్లో నిరాశపరిచిన ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లూరుుస్ హామిల్టన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు.

మెర్సిడెస్ డ్రైవర్‌కే ‘పోల్’ పొజిషన్  
నేడు మలేసియా గ్రాండ్‌ప్రి

 సెపాంగ్: గత మూడు రేసుల్లో నిరాశపరిచిన ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. శనివారం జరిగిన ఫార్ములావన్ మలేసియా గ్రాండ్‌ప్రి క్వాలిఫరుుంగ్ సెషన్‌లో ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ పోల్ పొజిషన్ సాధించాడు. ఈ సీజన్‌లో హామిల్టన్‌కిది ఎనిమిదో పోల్ పొజిషన్ కావడం విశేషం. అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 32.850 సెకన్లలో ముగించిన హామిల్టన్ మలేసియా గ్రాండ్‌ప్రి చరిత్రలో క్వాలిఫరుుంగ్ సెషన్‌లో కొత్త రికార్డు నెలకొల్పాడు.

మెర్సిడెస్‌కే చెందిన రోస్‌బర్గ్ రెండో స్థానం నుంచి రేసును మొదలుపెడతాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్, నికో హుల్కెన్‌బర్గ్ వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల నుంచి రేసును ప్రారంభిస్తారు. డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ రేసులో ప్రస్తుతం నికో రోస్‌బర్గ్ (273 పారుుంట్లు), హామిల్టన్ (265 పారుుంట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

 గ్రిడ్ పొజిషన్స్: 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. రోస్‌బర్గ్ (మెర్సిడెస్), 3. వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్), 4. రికియార్డో (రెడ్‌బుల్), 5. వెటెల్ (ఫెరారీ), 6. రైకోనెన్ (ఫెరారీ), 7.పెరెజ్ (ఫోర్స్ ఇండియా), 8. హుల్కెన్‌బర్గ్ (ఫోర్స్ ఇండియా), 9. బటన్ (మెక్‌లారెన్), 10. మసా (విలియమ్స్), 11. బొటాస్ (విలియమ్స్), 12. గ్రోస్యెన్ (హాస్), 13. గుటిరెజ్ (హాస్), 14. మాగ్నుసెన్ (రెనౌ), 15. క్వియాట్ (ఎస్టీఆర్), 16. సెరుుంజ్ (ఎస్టీఆర్), 17. ఎరిక్సన్ (సాబెర్), 18. నాసర్ (సాబెర్), 19. పాల్మెర్ (రెనౌ), 20. ఒకాన్ (మనోర్), 21. వెర్లీన్ (మనోర్), 22. అలోన్సో (మెక్‌లారెన్).

నేటి ప్రధాన రేసు
మధ్యాహ్నం గం. 12.25 నుంచి
స్టార్ స్పోర్‌‌ట్స-4లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement
 
Advertisement
Advertisement