‘పద్మ భూషణ్’కు పేస్! | Leander Paes recommended for Padma Bhushan | Sakshi
Sakshi News home page

‘పద్మ భూషణ్’కు పేస్!

Nov 21 2013 1:11 AM | Updated on Sep 2 2017 12:48 AM

భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ పేరును ఈ ఏడాది ‘పద్మ భూషణ్’ పురస్కారానికి సిఫారసు చేశారు.

బెంగళూరు: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ పేరును ఈ ఏడాది ‘పద్మ భూషణ్’ పురస్కారానికి సిఫారసు చేశారు. ఈ అవార్డు కోసం క్రీడాకారుల జాబితాలో పేస్ పేరును మాత్రమే కేంద్ర క్రీడా శాఖ పంపించినట్టు సమాచారం. 40 ఏళ్ల పేస్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 14 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో కలిపి మొత్తం 53 అంతర్జాతీయ టైటిల్స్‌ను సాధించాడు.  2016 రియో ఒలింపిక్స్‌లోనూ బరిలోకి దిగాలని భావిస్తున్నాడు.
 
 1990లో ‘అర్జున అవార్డు’ పొందిన పేస్‌కు 1997లో ‘రాజీవ్ ఖేల్త్న్ర’... 2001లో ‘పద్మశ్రీ’ పురస్కారాలు లభించాయి. ఒలింపిక్స్‌లో  వ్యక్తిగత విభాగంలో తొలి పతకాన్ని అందించిన దివంగత రెజ్లర్ ఖాషాబా జాదవ్...  షూటింగ్ జట్టు మాజీ కోచ్ సన్నీ ...  ఫుట్‌బాలర్ అరుణ్ ఘోష్ పేర్లను ‘పద్మశ్రీ’ పురస్కారాలకు నామినేట్ చేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement