ఢిల్లీ హైకోర్టులో మోడీకి ఊరట | Lalith modi gets relief in delhi high court | Sakshi
Sakshi News home page

ఢిల్లీ హైకోర్టులో మోడీకి ఊరట

Aug 27 2014 5:50 PM | Updated on Sep 2 2017 12:32 PM

ఢిల్లీ హైకోర్టులో మోడీకి ఊరట

ఢిల్లీ హైకోర్టులో మోడీకి ఊరట

ఐపీఎల్ బహిష్కృత చైర్మన్ లలిత్ మోడీకి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది.

న్యూఢిల్లీ: ఐపీఎల్ బహిష్కృత చైర్మన్ లలిత్ మోడీకి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. స్వాధీనం చేసుకున్న మోడీ పాస్ పోర్టును ఆయనకు అప్పగించాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో లండన్లో ఉంటున్న మోడీ భారత్కు తిరిగి వచ్చే అవకాశముంది.

ఐపీఎల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో బీసీసీఐ మోడీని బహిష్కరించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి గత నాలుగేళ్లుగా మోడీ లండన్లోనే ఉంటున్నారు. విచారణకు రావాలని ఈడీ ఆదేశించినా.. భారత్లో తనకు ప్రాణ హాని ఉందంటూ అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి రాజస్థాన్ క్రికెట్ సంఘం ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు.

Advertisement
 
Advertisement
Advertisement