టైటిల్‌ పోరుకు లక్ష్య సేన్‌ | Lakshya Sen Enters Finals Of Dutch Open | Sakshi
Sakshi News home page

టైటిల్‌ పోరుకు లక్ష్య సేన్‌

Oct 13 2019 9:25 AM | Updated on Oct 13 2019 9:25 AM

Lakshya Sen Enters Finals Of Dutch Open - Sakshi

న్యూఢిల్లీ: భారత యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ డచ్‌ ఓపెన్‌ సూపర్‌–100 బ్యాడ్మింటన్‌ టోర్నీ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు. ఆరంభం నుంచి టోర్నీలో నిలకడగా ఆడుతున్న అతను ఫైనల్‌ చేరాడు. శనివారం నెదర్లాండ్స్‌లో జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో లక్ష్యసేన్‌ 21–12, 21–9తో ఫెలిక్స్‌ బురెస్టెడ్‌ (స్వీడన్‌)పై గెలిచి తుది పోరుకు అర్హత సాధించాడు.

33 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఆత్మవిశ్వాసంతో ఆడిన లక్ష్యసేన్‌ ప్రత్యరి్థపై పూర్తి ఆధిపత్యం చలాయించాడు. క్వార్టర్‌ ఫైనల్లో లక్ష్యసేన్‌ 21–9, 21–16తో భారత్‌కే చెందిన రాహుల్‌ భరద్వాజ్‌పై విజయం సాధించాడు. నేడు జరిగే ఫైనల్‌లో యుసుకె ఒనోడెర (జపాన్‌)తో లక్ష్యసేన్‌ తలపడతాడు. 

Advertisement
 
Advertisement
Advertisement