లక్ష్మీ తులసికి రజతం | Lakshmi Tulasi Gets Silver Medal In Taekwondo | Sakshi
Sakshi News home page

లక్ష్మీ తులసికి రజతం

Jun 17 2019 2:04 PM | Updated on Jun 17 2019 2:04 PM

Lakshmi Tulasi Gets Silver Medal In Taekwondo - Sakshi

హైదరాబాద్‌: ఇంటర్నేషనల్‌ తైక్వాండో పోటీల్లో కుత్బుల్లాపూర్‌ బాలికలు శ్రీజరెడ్డి, లక్ష్మీ తులసి రాణించారు. భారత తైక్వాండో సమాఖ్య ఆధ్వర్యంలో గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో  జరిగిన ఈ పోటీల్లో లక్ష్మీ తులసి రజత పతకాన్ని గెలుచుకోగా... శ్రీజరెడ్డి కాంస్యాన్ని సాధించింది. కొంపల్లికి చెందిన శ్రీజరెడ్డి 47 కేజీల విభాగంలో మూడో స్థానంలో నిలిచింది. లక్ష్మీ తులసి 51 కేజీల విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. ఐదు రోజుల పాటు పోటీలు జరుగగా.. పదిహేను దేశాలకు చెందిన దాదాపు 2500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement