హంపికి రెండో విజయం | Sakshi
Sakshi News home page

హంపికి రెండో విజయం

Published Tue, Sep 2 2014 12:53 AM

koneru humpy second victory

షార్జా: ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ మూడో ర్యాంకర్ కోనేరు హంపి రెండో విజయం సాధించింది. తాతియానా కొసింత్‌సెవా (రష్యా)తో సోమవారం జరిగిన ఏడో రౌండ్ గేమ్‌లో హంపి 60 ఎత్తుల్లో గెలిచింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక నాలుగో ‘డ్రా’ నమోదు చేసుకుంది.
 
 అనా ఉషెనినా (ఉక్రెయిన్)తో జరిగిన గేమ్‌ను హారిక 43 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఏడో రౌండ్ తర్వాత హంపి ఖాతాలో మూడు, హారిక ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. మంగళవారం జరిగే ఎనిమిదో రౌండ్‌లో అనా ఉషెనినాతో హంపి; చెన్ జూ (ఖతార్)తో హారిక తలపడతారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement