ఫీల్డింగ్‌ ఎంచుకున్న కింగ్స్‌ పంజాబ్‌ | Kings XI Punjab have won the toss and opted to field | Sakshi
Sakshi News home page

ఫీల్డింగ్‌ ఎంచుకున్న కింగ్స్‌ పంజాబ్‌

May 6 2018 7:44 PM | Updated on May 6 2018 8:08 PM

Kings XI Punjab have won the toss and opted to field - Sakshi

ఇండోర్‌ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ఆదివారం ఇక్కడ హోల్కర్‌ క్రికెట్‌ స్టేడియంలో రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్‌ అశ్విన్‌.. ముందుగా రాజస్తాన్‌ రాయల్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

ఈ సీజన్‌లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్‌. ఇప్పటివరకూ కింగ్స్‌ పంజాబ్‌ ఎనిమిది మ్యాచ్‌లు ఆడి ఐదు విజయాలతో నాల్గో స్థానంలో కొనసాగుతుండగా, రాజస్తాన్‌ రాయల్స్‌ ఎనిమిది మ్యాచ్‌లకు గాను మూడు విజయాల్ని మాత్రమే సాధించి చివరి స్థానంలో ఉంది. రాజస్తాన్‌ ప్లే ఆఫ్‌ ఆశల్ని నిలుపుకోవాలంటే ఇక నుంచి ప్రతీ మ్యాచ్‌ గెలవాల్సి ఉంది. ఈ తరుణంలో కింగ్స్‌ పంజాబ్‌పై విజయం సాధించాలనే పట్టుదలతో రాజస్తాన్‌ బరిలోకి దిగుతోంది. మరొకవైపు కింగ్స్‌ పంజాబ్‌ గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలు కావడంతో విజయంతో గాడిలో పడాలని యోచిస్తోంది.  దాంతో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది.

తుదిజట్లు
కింగ్స్‌ పంజాబ్‌ 
రవిచంద్రన్‌ అశ్విన్‌(కెప్టెన్‌), క్రిస్‌గేల్‌, లోకేశ్‌ రాహుల్‌, కరుణ్‌ నాయర్‌, మయాంక్‌ అగర్వాల్‌, మార్కస్‌ స్టోయినిస్‌‌, మనోజ్‌ తివారీ, అక్షర్‌ పటేల్‌, ముజీబ్ ఉర్ రహ్మాన్‌, అంకిత్‌ రాజ్‌పుత్‌, అండ్రూ టై

రాజస్తాన్‌ రాయల్స్‌ 
అజింక్యా రహానే(కెప్టెన్‌), జోస్‌ బట్లర్‌, డీ ఆర్సీ షార్ట్‌, సంజూ శాంసన్‌, బెన్‌ స్టోక్స్‌, రాహుల్‌ త్రిపాఠి, కృష్ణప్ప గౌతమ్‌‌, జోఫ్రా అర్చర్‌, శ్రేయాస్‌ గోపాల్‌, అనురిత్‌ సింగ్‌ ‌, జయదేవ్‌ ఉనద్కత్‌

Advertisement
 
Advertisement
Advertisement