చాంపియన్స్ లీగ్: పంజాబ్ విజయం | Kings XI Punjab beat Barbados Trident | Sakshi
Sakshi News home page

చాంపియన్స్ లీగ్: పంజాబ్ విజయం

Sep 21 2014 12:12 AM | Updated on Sep 2 2017 1:41 PM

చాంపియన్స్ లీగ్ టి -20లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్లో కింగ్స్ లెవెన్ పంజాబ్ నాలుగు వికెట్లతో బార్బడోస్పై విజయం సాధించింది.

మొహాలీ: చాంపియన్స్ లీగ్ టి -20లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్లో కింగ్స్ లెవెన్ పంజాబ్ నాలుగు వికెట్లతో బార్బడోస్పై విజయం సాధించింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ మరో రెండు బంతులు మిగిలుండగా ఆరు వికెట్ల నష్టానికి విజయతీరాలకు చేరింది. డేవిడ్ మిల్లర్ 46 (నాటౌట్), వీరేంద్ర సెహ్వాగ్ 31 పరుగులు చేశారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన పూర్తి ఓవర్లలో ఆరు వికెట్లకు 174 పరుగులు చేసింది. రీఫర్ 60 (నాటౌట్) మునవీర (50) హాఫ్ సెంచరీలతో రాణించారు.

Advertisement
 
Advertisement
Advertisement