ప్రిక్వార్టర్స్‌లో కవీందర్, సంజీత్‌ | Kavinder Singh and Sanjit Entaire Pre quarter final | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో కవీందర్, సంజీత్‌

Sep 16 2019 3:51 AM | Updated on Sep 16 2019 3:51 AM

Kavinder Singh and Sanjit Entaire Pre quarter final - Sakshi

ఎకతెరీన్‌బర్గ్‌ (రష్యా): ప్రపంచ సీనియర్‌ పురుషుల బాక్సింగ్‌ ఛాంపియన్షిప్ లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. ఆదివారం ముగ్గురు బాక్సర్లు బరిలోకి దిగగా... ఇద్దరు విజయాలు నమోదు చేశారు. మరొకరు ఓడిపోయారు. 57 కేజీల విభాగంలో కవీందర్‌ సింగ్‌ బిష్త్, 91 కేజీల విభాగంలో సంజీత్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. 81 కేజీల విభాగంలో బ్రిజేశ్‌ యాదవ్‌ పోరాటం ముగిసింది. కవీందర్‌ 3–2తో చెనా జిహావో (చైనా)పై, సంజీత్‌ 4–1తో స్కాట్‌ ఫారెస్ట్‌ (స్కాట్లాండ్‌)పై విజయం సాధించారు. బ్రిజేశ్‌ యాదవ్‌ 1–4తో బేరమ్‌ మల్కాన్‌ (టర్కీ) చేతిలో పోరాడి ఓడిపోయాడు. ఇప్పటికే భారత్‌ నుంచి అమిత్‌ పంగల్‌ (52 కేజీలు), మనీశ్‌ కౌశిక్‌ (63 కేజీలు) ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు.   

Advertisement
 
Advertisement
Advertisement