‘ఈ ఏడాది వరల్డ్‌కప్‌ కష్టమే’

Katich Feels T20 World Cup Can Be Postponed By A Year - Sakshi

వచ్చే ఏడాదికి వాయిదా తప్పకపోవచ్చు

ఆ మేరకు సీఏ సన్నద్ధం కావాలి

మెల్‌బోర్న్‌: కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ఈ ఏడాది జరగబోయే టీ20 వరల్డ్‌కప్‌పై కూడా ఆశలు వదులుకోవాల్సిందేనని ఆసీస్‌ మాజీ క్రికెటర్‌, ఆర్సీబీ హెడ్‌ కోచ్‌ సైమన్‌ కాటిచ్‌ అభిప్రాయపడ్డాడు. తన దృష్టిలో ముందుస్తు షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌లో ఆరంభం కావాల్సి ఉన్న టీ20 వరల్డ్‌కప్‌ జరిగే అవకాశాలు దాదాపు లేవన్నాడు. 2021 ఫిబ్రవరిలో మహిళల టీ20 వరల్డ్‌కప్‌ జరగనుందని, పురుషుల టీ20 వరల్డ్‌కప్‌ కూడా అప్పుడు నిర్వహించడానికే ఎక్కువ అవకాశాలున్నాయన్నాడు. (అది చాలా వింతగా ఉంటుంది: అలెక్స్‌ క్యారీ)

ఇప్పటివరకూ టీ20 వరల్డ్‌కప్‌ ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం జరుగుతుందా.. లేదా అనే దానిపై ఐసీసీ స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ, వచ్చే ఏడాది సమ‍్మర్‌లో ఈ మెగా టోర్నీ నిర్వహణ కోసం క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) ముందుగానే సన్నద్ధం అయితే మంచిదన్నాడు. ఫ్యూచర్‌ టోర్నమెంట్స్‌ ప్రొగ్రామ్స్‌(ఎఫ్‌టీపీ) గురించి ప్రస్తుతం జరుగుతున్న చర్చ గురించి వింటుంటే అది ఎంతవరకూ సాధ్యపడుతుందనే అనుమానం వస్తుందన్నాడు. ఇందుకు కరోనా వైరస్‌ ప్రభావం క్రమేపీ పెరగడమే భవిష్య క్రికెట్‌ టోర్నమెంట్‌లపై అనేక సందేహాలకు తావిస్తుందన్నాడు. 

ఇదిలా ఉంచితే, టీ20 వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ను మార్చాలనే ఇప్పటివరకూ ఎవరూ డిమాండ్‌ తేలేదని విషయాన్ని ఐసీసీ ధృవీకరించింది. ఐసీసీ నిర్వహించే బోర్డు మీటింగ్‌ల్లో ఈ ప్రస్తావన రాలేదు. వరల్డ్‌కప్‌కు ఇంకా చాలా సమయం ఉన్నందునే ఎవరూ కూడా పెదవి విప్పడం లేదు. ఇక టోర్నీకి ఆతిథ్యమిచ్చే ఆస్ట్రేలియా కూడా ఇప్పట్నుంచే షెడ్యూల్‌ గురించి మాట్లాడటం అనవరసం అనే ధోరణిలో ఉంది. మార్చి 27వ తేదీన టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా ఐసీసీ నిర్వహించిన సమావేశంలో కరోనా మహమ్మారిపై విస్తృతంగా చర‍్చించారు. ప్రధానంగా ప్రపంచ వ్యాప్తంగా క్రీడా ఈవెంట్లపై కరోనా తీవ్రతపై మాట్లాడారు. కానీ టీ20 వరల్డ్‌కప్‌ వాయిదా వేయలానే డిమాండ్‌ మాత్రం వినిపించలేదు. (అప్పటివరకూ ఐపీఎల్‌ వాయిదా..!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top