అది చాలా వింతగా ఉంటుంది: అలెక్స్‌ క్యారీ

It Would Be Strange To Play Without Fans, Carey  - Sakshi

మెల్‌బోర్న్‌: కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ప్రపంచం లాక్‌డౌన్‌లో పడిపోయింది. ఇది ఎంత వరకూ వెళుతుందో ఇప్పటికీ ఎవరికీ అర్థం కావడం లేదు. లాక్‌డౌన్‌పై ఇప్పటికే పలు దేశాలు కఠిన నిబంధనల్ని తీసుకొచ్చి కరోనాపై పోరాటానికి సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే పలు క్రీడా ఈవెంట్‌లు వాయిదా పడగా, కొన్నింటిని రద్దు చేయక తప్పలేదు. ఐపీఎల్‌ వంటి క్యాష్‌ రిచ్‌ లీగ్‌ను నిరవధిక వాయిదా వేయగా, ఈ ఏడాది అక్టోబర్‌లో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు కూడా ఈ సెగ తప్పేలా కనబడుటం లేదు. అప్పటికి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చినా ప్రేక్షకులు లేకుండా మెగా టోర్నీని నిర్వహించాలనే డిమాండ్‌ ఎక్కువైంది. దీనిపై అంతా పెదవి విరుస్తున్నారు. వరల్డ్‌కప్‌ వంటి ఒక మెగా టోర్నీని ప్రేక్షకులు లేకుండా నిర్వహిస్తే అసలు మజానే ఉండదని అభిప్రాయపడుతున్నారు. తాజాగాఆసీస్‌ క్రికెటర్‌ అలెక్స్‌ క్యారీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ప్రేక్షకులు లేకుండా నిర్వహించడం అంటే చాలా వింతంగా ఉంటుందన్నాడు. (అప్పటివరకూ ఐపీఎల్‌ వాయిదా..!)

‘షెడ్యూల్‌ ప్రకారం చూస్తే అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయనేది చెప్పడం కష్టం. ఒకవేళ మనం ఇప్పుడే ఒక తేదీ ఫిక్స్‌ చేసినా అది సరైనదేననే గ్యారంటీ లేదు. వరల్డ్‌కప్‌ను వాయిదా వేసి మూడు నెలల తర్వాత నిర్వహిద్దాం అని చెప్పడం కూడా చాలా కష్టం. దీనిపై ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని నమ్ముతున్నా. కాకపోతే స్టేడియాల్లో అభిమానులు లేకుండా మెగా టోర్నీని నిర్వహిస్తే ఒక కొత్త ఫీలింగ్‌ వస్తుంది. ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో ప్రపంచం నలుమూలలు నుంచి అభిమానులు రావడం ఎంత క్రేజ్‌ను తెచ్చిందో మనం చూశాం. మనం ఫ్యాన్స్‌ లేకుండా ఆడాలంటే చాలా వెలితిగా ఉంటుంది. అదే ఫ్యాన్స్‌ మధ్యలో ఆడాలంటే ఆ మజానే వేరు. ఒకవేళ ఫ్యాన్స్‌ లేకుండా ఆడాల్సి వస్తే కచ్చితంగా ఆడతాను. ఎందుకంటే గేమ్‌పై ప్రేమే ఇక్కడ ముఖ్యం’ అని క్యారీ తెలిపాడు.(ప్రేక్షకులు లేకుంటే...కోహ్లి ఎలా ఆడతాడో !)

Election 2024

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top