జ్యోతి సురేఖ పసిడి గురి | Jyothi Surekha Aim to gold | Sakshi
Sakshi News home page

జ్యోతి సురేఖ పసిడి గురి

Jun 6 2016 12:33 AM | Updated on Sep 4 2017 1:45 AM

జ్యోతి సురేఖ పసిడి గురి

జ్యోతి సురేఖ పసిడి గురి

ప్రపంచ విశ్వవిద్యాలయాల ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది.

సాక్షి, హైదరాబాద్: ప్రపంచ విశ్వవిద్యాలయాల ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగోలియాలోని ఉలాన్‌బాటర్‌లో ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో జ్యోతి సురేఖ మహిళల కంపౌండ్ టీమ్ విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించింది.

జ్యోతి సురేఖ, స్వాతి, ప్రియాంశులతో కూడిన భారత బృందం ఫైనల్లో 228-220తో రష్యాను ఓడించింది. అంతకుముందు సెమీస్‌లో భారత్ 228-225తో అమెరికాపై, క్వార్టర్ ఫైనల్లో 219-218తో బ్రిటన్‌పై విజయం సాధించింది. విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న 19 ఏళ్ల జ్యోతి సురేఖ వ్యక్తిగత విభాగంలో మాత్రం క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించింది.

Advertisement
 
Advertisement
Advertisement