breaking news
KL University
-
'కేఎల్ యూనివర్సిటీ ఆ హోదాను కోల్పోలేదు'
సాక్షి, విజయవాడ : కేఎల్ యూనివర్సిటీ.. ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ హోదాను కోల్పోయిందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎల్ఎస్ఎస్ రెడ్డి అన్నారు. సోషల్ మీడియాలో వస్తోన్న ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రచారంపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. '40 సంవత్సరాలుగా నాణ్యమైన విద్య అందిస్తున్నాం. విద్యా రంగంలో కేఎల్ యూనివర్సిటీ కనబరుస్తున్న ప్రతిభ వల్ల మా విద్యా సంస్థ డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదాను పొందింది. యూజీసీ, ఎంహెచ్ఆర్డీ నిబంధనలకు అనుగుణంగానే మా యూనివర్సిటీలో ప్రవేశాలు, విద్యా బోధన, పరిశోధనలు జరుగుతాయి' అని వీసీ వెల్లడించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. చదవండి: కీలక బిల్లులపై హైకోర్టులో విచారణ వాయిదా -
జ్యోతి సురేఖ పసిడి గురి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ విశ్వవిద్యాలయాల ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగోలియాలోని ఉలాన్‌బాటర్‌లో ముగిసిన ఈ మెగా ఈవెంట్లో జ్యోతి సురేఖ మహిళల కంపౌండ్ టీమ్ విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించింది. జ్యోతి సురేఖ, స్వాతి, ప్రియాంశులతో కూడిన భారత బృందం ఫైనల్లో 228-220తో రష్యాను ఓడించింది. అంతకుముందు సెమీస్‌లో భారత్ 228-225తో అమెరికాపై, క్వార్టర్ ఫైనల్లో 219-218తో బ్రిటన్‌పై విజయం సాధించింది. విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న 19 ఏళ్ల జ్యోతి సురేఖ వ్యక్తిగత విభాగంలో మాత్రం క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించింది.