హాఫ్‌ కరోనా! ఇదెక్కడిది? స్పందించిన గుత్తా

Jwala Gutta React On Now People Call Her Half Corona - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ సమయంలో విద్యావంతులే రోడ్లపై జాగింగ్‌ చేయడాన్ని ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణ గుత్తా జ్వాల తప్పుబట్టారు. అంతేకాకుండా లాక్‌డౌన్‌ సక్రమంగా పాటించని అలాంటి వారే కరోనా వైరస్‌ వ్యాప్తికి ఓ వర్గం కారణమంటూ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత కొద్ది రోజులుగా తనను ‘హాఫ్‌ కరోనా’ అని కొందరు అనడం జాత్యహంకార చర్యగా అభివర్ణించారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో సోషల్‌ మీడియాలో తనను హాఫ్‌ కరోనా అని పేర్కొనడం, గతంలో ఈశాన్య రాష్ట్ర ప్రజలపై జాత్యహంకార దాడులు జరగడం వంటి విషయాలపై ఆమె స్పందించారు.   

‘నేను సోషల్‌ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటాను. ఈ క్రమంలో గతంలో ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఓ అమ్మాయిపై ఉమ్మేశారు. ఆ వీడియో వైరల్‌ అయింది. దీంతో నేను వెంటనే దేశంలో జాత్యహంకారం పెరిగిపోయిందని కామెంట్‌ చేశా.  ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రారంభమయ్యాక తనను కొందరు నెటిజన్లు హాప్‌ కరోనా, చైనాకా మాల్‌, హాఫ్‌ చైనీస్‌, చింకీ అని పిలవడం ప్రారంభించారు. ఎందుకుంటే నా తల్లి చైనా దేశస్థురాలు కాగా నా తండ్రి తెలుగువాడు. దీంతో నన్ను హాఫ్‌ కరోనా అని అంటున్నారు. ఇది కూడా జాత్యహంకారమే కదా. 

లాక్‌డౌన్‌లో ఉదయం లేవగానే చూస్తే మన(హైదరాబాద్‌) రోడ్లపై కొందరు విద్యావంతులు జాగింగ్‌ చేయడం చూస్తున్నా. ఆసక్తికర విషయం ఏంటంటే వారే కరోనా వైరస్‌ వ్యాప్తిని ఓ వర్గానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక లాక్‌డౌన్‌ సమయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నా. సినిమాలు, షోస్‌ చూస్తూ ఇంటి పనుల్లో సహాయం చేస్తున్నా. ఇక టోక్యో ఒలింపిక్స్‌ వాయిదా పడటం క్రీడాకారులకు ఒకింత నిరాశ కలిగించేదే. కానీ ఈ సమయంలో అంతకుమించి ఎవరు ఏం చేయలేరు. అయితే ఒలింపిక్స్‌కు సన్నద్దమయ్యే వారు ఈ సమయంలో శారీరకంగా కంటే మానసికంగా ధృఢంగా ఉండాలి’ అని గుత్తా జ్వాల పేర్కొన్నారు.

ఇక మహమ్మారి కరోనా వైరస్‌ చైనాలో పుట్టి అనేక దేశాలకు పాకింది. ఈ మహమ్మారితో ప్రపంచదేశాలన్ని చిగురుటాకులా వణికిపోతున్నాయి. కరోనా బాధితుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా లక్షల్లో ఉండగా.. అనేక వేల మంది మృత్యువాతపడ్డారు. దీంతో చైనా, ఆ దేశ ప్రజలపై సోషల్‌ మీడియావేదికగా నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సైతం చైనా వైరస్‌ అని పేర్కొని ఆ ఆరోపణలకు మరింత ఆజ్యం పోశాడు. దీంతో అన్ని దేశాల ప్రజలకు చైనాపై ఓ రకమైన వివక్ష ఏర్పడింది. 

చదవండి:
లాక్‌డౌన్‌: బాయ్‌ఫ్రెండ్‌ను మిస్‌ అవుతున్నా
ప్రాణాలకంటే ఆటలు ఎక్కువ కాదు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

24-05-2020
May 24, 2020, 10:44 IST
న్యూఢిల్లీ : ప్రముఖ పల్మనాలజిస్ట్‌, ఢిల్లీ ఎయిమ్స్‌ సీనియర్‌ డాక్టర్‌ జితేంద్రనాథ్‌ పాండే కరోనాతో మృతిచెందారు. కరోనా సోకడంతో తన...
24-05-2020
May 24, 2020, 09:34 IST
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 6,767 కరోనా కేసులు నమోదు...
24-05-2020
May 24, 2020, 08:24 IST
ముంబై : బాలీవుడ్‌ను కరోనా వైరస్‌ వదలడం లేదు. ఇప్పటికే సింగర్‌ కనికా కపూర్‌, నిర్మాత కరీం మోరాని, ఆయన...
24-05-2020
May 24, 2020, 06:36 IST
సాక్షి, హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ను మరికొంతకాలం పొడిగిస్తే.. ప్రజా జీవనం స్తంభించి పేద, మధ్య తరగతి ప్రజలు తమ జీవనోపాధి...
24-05-2020
May 24, 2020, 06:32 IST
వాషింగ్టన్‌: ఈఏడాదికి అమెరికాలో తమ చదువులను పూర్తి చేసుకున్న విద్యార్థులకు వర్చువల్‌ స్నాతకోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో...
24-05-2020
May 24, 2020, 06:15 IST
ప్రముఖ మలయాళ నటుడు సురేష్‌ గోపి త్వరలోనే ఓ కొత్త మైలు రాయిని అందుకోబోతున్నారు. నటుడిగా 247 సినిమాల వరకూ...
24-05-2020
May 24, 2020, 06:09 IST
‘‘రంగేయడానికి ఒకళ్లు.. జడేయడానికి ఒకళ్లు.. బాగానే ఉంది దర్జా.. హ్హహ్హహ్హ’’.... ‘మహానటి’ సినిమాలోని డైలాగ్‌ ఇది. సావిత్రి పాత్రధారి కీర్తీ...
24-05-2020
May 24, 2020, 05:58 IST
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ‘లవ్‌ స్టోరీ’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు శేఖర్‌ కమ్ముల. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌.ఎల్‌.పి...
24-05-2020
May 24, 2020, 05:50 IST
బెర్లిన్‌: లాటిన్‌ అమెరికాలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఆ దేశాల్లో ప్రభుత్వాల నిర్లక్ష్యమే కేసుల్ని పెంచేస్తోంది. బ్రెజిల్, మెక్సికోలో...
24-05-2020
May 24, 2020, 05:35 IST
రెండు నెలలు దాటిపోయింది ప్రపంచం స్తంభించిపోయి.. సినిమా ఆగిపోయి. పనులు మెల్లిగా మొదలవుతున్నాయి. పరుగులు మెల్లిగా ప్రారంభం కాబోతున్నాయి. సినిమా...
24-05-2020
May 24, 2020, 04:58 IST
న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకురానున్న 10 రోజుల్లో 2,600 శ్రామిక్‌...
24-05-2020
May 24, 2020, 04:52 IST
న్యూఢిల్లీ: దేశంలో లాక్‌డౌన్‌ నిబంధనల నుంచి మినహాయింపులు ఇచ్చిన తర్వాత కరోనా మహమ్మారి జడలు విప్పుతోంది. వరుసగా రెండో రోజు...
24-05-2020
May 24, 2020, 04:33 IST
న్యూఢిల్లీ:   ఇండియాలో ఆగస్టు లేదా సెప్టెంబర్‌ కంటే ముందే అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలను పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు పౌర విమానయాన...
24-05-2020
May 24, 2020, 04:22 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ బారిన పడిన వారిలో మరో 47 మంది కోలుకున్నారు. దీంతో కరోనా వైరస్‌...
24-05-2020
May 24, 2020, 04:19 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మన దేశంలోనూ, రాష్ట్రంలోనూ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. మన రాష్ట్రంలో వైరస్‌...
24-05-2020
May 24, 2020, 04:16 IST
సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది....
24-05-2020
May 24, 2020, 03:17 IST
వైద్య సిబ్బంది కొరత లేకుండా చూసుకోవాలి. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న ఖాళీలను గుర్తించి రిక్రూట్‌మెంట్‌ను వేగంగా చేయాలి. ఎన్ని ఖాళీలుంటే.....
24-05-2020
May 24, 2020, 00:08 IST
‘‘రామ్‌’ ప్రయాణం ఆగిపోలేదని, తాత్కాలిక బ్రేక్‌ మాత్రమే పడింది’’ అంటున్నారు దర్శకుడు జీతూ జోసెఫ్‌. మోహన్‌లాల్, త్రిష జంటగా జీతూ...
23-05-2020
May 23, 2020, 22:11 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 52 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటెన్‌లో ప్రకటించింది....
23-05-2020
May 23, 2020, 20:59 IST
వాష్టింగ్టన్: కరోనా మహమ్మారి సంక్షోభం కాలంలో అమెరికా అతలాకుతలమవుతోంది. ఆర్థికవ్యవస్థ మరింత మందగమనంలోకి కూరుకుపోతోందని స్వయంగా ఫెడ్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే  ఈ...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top