లాక్‌డౌన్‌: బాయ్‌ఫ్రెండ్‌ను మిస్‌ అవుతున్నా | Gutta Jwala Misses Her Boyfriend Vishnu Vishal During Lockdown | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌:  బాయ్‌ఫ్రెండ్‌ను మిస్ అవుతున్న క్రీడాకారిణి

Mar 30 2020 8:44 AM | Updated on Mar 30 2020 8:46 AM

Gutta Jwala Misses Her Boyfriend Vishnu Vishal During Lockdown - Sakshi

దేశంలో క‌రోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో ఏప్రిల్ 14 వ‌ర‌కు లాక్‌డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. దీంతో ఎక్కడివారు అక్కడి ఉండిపోయారు. కొందరు అత్మీయులకు, బంధువులకు దూరంగా చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలోనే బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా త‌న బాయ్ ప్రెండ్ విష్ణు విశాల్‌ను మిస్ అవుతుంద‌టా.. ఈ విష‌యాన్ని జ్వాలానే స్వ‌యంగా ట్విట‌ర్ ద్వారా తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా గుత్తా జ్వాలా హైద‌రాబాద్‌లోనే ఉంటున్నారు. తన ప్రియుడు విష్ణు విశాల్‌ను మిస్ అవుతున్న‌ట్లు తెలిపారు. ఈ మేరకు మిస్ యూ..అంటూ ట్వీట్ చేశారు. అయితే దీనిపై స్పందించిన‌ విష్ణు ప‌ర్లేదు.. ప్ర‌స్తుతం సామాజిక దూరం ముఖ్యం.. అంటూ జ్వాలాను కూల్ చేశారు.


కాగా బ్యాడ్మింటన్‌ ఫైర్‌ బ్రాండ్‌  గుత్తా జ్వాల, త‌మిళ న‌టుడు విష్ణు విశాల్‌ రిలేష‌న్‌షిప్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. గ‌తంలో వీరిద్ద‌రికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ అవ్వ‌గా అందులో  విష్ణు.. గుత్తా జ్వాల‌కు ముద్దు పెడుతున్న ఫోటో కూడా ఇందులో ఉండ‌టం విశేషం. దీంతో వీరిద్ద‌రూ ప్రేమాయ‌ణం న‌డుపుత‌న్న‌ట్లు క్లారిటీ ఏర్ప‌డింది. ఇక‌ హీరో విష్ణు విశాల్ గతేడాది జూన్‌లో తన భార్య రజనీతో విడిపోయిన విషయం తెలిసిందే. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. మరోవైపు గుత్తా జ్వాల కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న మరో బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు చేతన్‌ ఆనంద్‌తో విభేదాల కారణంగా విడిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement