షూటర్ జీతూకు స్వర్ణం | Jeetu shooter to the gold | Sakshi
Sakshi News home page

షూటర్ జీతూకు స్వర్ణం

Jun 20 2014 1:06 AM | Updated on Sep 2 2017 9:04 AM

షూటర్ జీతూకు స్వర్ణం

షూటర్ జీతూకు స్వర్ణం

భారత షూటర్ జీతూ రాయ్ ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించాడు. స్లొవేనియాలోని మారిబోర్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్ ఎయిర్ పిస్టల్ విభాగం ఫైనల్ రౌండ్‌లో 200.8 పాయింట్లతో స్వర్ణం దక్కించుకున్నాడు.

న్యూఢిల్లీ: భారత షూటర్ జీతూ రాయ్ ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించాడు. స్లొవేనియాలోని మారిబోర్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్ ఎయిర్ పిస్టల్ విభాగం ఫైనల్ రౌండ్‌లో 200.8 పాయింట్లతో స్వర్ణం దక్కించుకున్నాడు. ఈ పతకంతో పాటు ఇంతకుముందే ఫ్రీ పిస్టల్‌లో రజతం సాధించిన జీతూ ప్రపంచకప్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు. ఇదే ఈవెంట్‌లో పాల్గొన్న మరో భారత షూటర్ పీఎన్ ప్రకాశ్ ఐదో స్థానంలో నిలిచాడు. మరోవైపు మ్యూనిచ్‌లో జరిగిన చివరి ప్రపంచకప్‌లోనూ జీతూ ఎయిర్ పిస్టల్‌లో రజతం దక్కించుకున్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement