breaking news
issf world cup
-
ప్రపంచకప్‌లో స్వర్ణ పతకం గెలిచిన ఆంధ్రప్రదేశ్ షూటర్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) జూనియర్ ప్రపంచకప్ టోర్నీని భారత్ ‘టాప్’ ర్యాంక్‌తో ముగించింది. చివరిరోజు బుధవారం భారత్‌కు మూడు పతకాలు లభించాయి. జూనియర్ పురుషుల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ షూటర్ ముకేశ్ నేలవల్లి స్వర్ణ పతకాన్ని సాధించాడు. గుంటూరు జిల్లాకు చెందిన ముకేశ్ 585 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. భారత్‌కే చెందిన సాహిల్ 573 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. ఈ టోరీ్నలో ముకేశ్కిది రెండో పతకం. అంతకుముందు ముకేశ్ 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో రజతం గెలిచాడు. జూనియర్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో భారత షూటర్ తేజస్విని 30 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించింది. ఓవరాల్‌గా భారత్ 8 స్వర్ణాలు, 10 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి మొత్తం 26 పతకాలతో ‘టాప్’ ర్యాంక్‌లో నిలిచింది. -
ISSF World Cup: ఎట్టకేలకు భారత్ బోణీ.. స్వర్ణం గెలిచిన ఇషా
అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ISFF) తాజా సీజన్‌లోని చివరి ప్రపంచకప్‌లో భారత షూటర్ ఇషా సింగ్ (Esha Singh) సత్తా చాటింది. మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. తద్వారా ఈ మెగా ఈవెంట్లో భారత్‌కు తొలి మెడల్ అందించింది. కాగా చైనాలోని నింగ్బోలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ టోర్నీలో తొలి నాలుగు రోజుల్లో భారత్ కనీసం ఒక్క కాంస్య పతకం కూడా నెగ్గలేకపోయింది.వైఫల్యాల పరంపరషూటింగ్ ఈవెంట్లో ఇన్ని రోజులైనా కూడా భారత్ బోణీ కొట్టలేకపోవడం బహుశా ఇటీవల ఇదే తొలిసారి!.. పురుషులు, మహిళల ఈవెంట్లలో శుక్రవారం వరకు వరుస వైఫల్యాల పరంపర కొనసాగింది. శుక్రవారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో మెహులీ ఘోష్, మానిని కౌశిక్ అత్యంత పేలవ ప్రదర్శనతో నిరాశపరిచారు. 2023లో బాకులో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన మెహులీ క్వాలిఫయింగ్‌లో 583 పాయింట్లతో 23వ స్థానంలో నిలిచింది.ఇక మానిని 580 పాయింట్లతో 45వ స్థానానికి పరిమితమైనింది. తెలంగాణకు చెందిన మరో షూటర్ రాపోలు సురభి భరద్వాజ్ 578 పాయింట్లతో ఏకంగా 52వ స్థానంలో నిలిచింది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్ భవేశ్ షెకావత్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. క్వాలిఫికేషన్ రౌండ్లో అతను నాలుగో స్థానంలో నిలువడం ద్వారా ఫైనల్ చేరే అవకాశాల్ని సజీవంగా ఉంచుకున్నాడు.ఇషాకు ఇదే తొలి స్వర్ణంఈ క్రమంలో భారత్ ఆశలన్నీ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో పోటీపడే రిథమ్ సాంగ్వాన్, ఇషా సింగ్, సురభి రావులపై నిలవగా.. 20 ఏళ్ల ఇషా శనివారం పసిడి పతకం గెలిచింది. నింగ్బో స్పోర్ట్స్ సెంటర్లో జరిగిన పోటీ ఫైనల్లో యావో కియాంగ్జున్ (చైనా)ను 0.1 పాయింట్ తేడాతో ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. ఇక ఒలింపిక్ చాంపియన్ ఓ యెజిన్ (సౌత్ కొరియా) కాంస్యం దక్కించుకుంది.కాగా ప్రపంచకప్ ఈవెంట్లో ఇషాకు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. ఇక ఈ తెలంగాణ షూటర్ గెలుపుతో.. ఈ ఈవెంట్లో బోణీ కొట్టిన భారత్ పతకాల పట్టికలో ఎట్టకేలకు చోటు సంపాదించింది. ప్రస్తుతానికి ఐదో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఆతిథ్య దేశం చైనా రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఒక కాంస్యంతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.చదవండి: బీసీసీఐ కూడా చెప్పినట్లే వినాలి! -
ISSF World Championships: స్వప్నిల్ గురికి ‘పారిస్’ బెర్త్ ఖరారు
ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్ ద్వారా భారత్‌కు మరో ఒలింపిక్ బెర్త్ ఖరారైంది. ఈజిప్ట్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో శనివారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలె నాలుగో స్థానంలో నిలిచి 2024 పారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్నాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు షూటింగ్లో భారత్‌కు మూడు ఒలింపిక్ బెర్త్‌లు లభించాయి. ట్రాప్ ఈవెంట్లో భౌనీష్ మెందిరత్త, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో రుద్రాం„Š పాటిల్ పారిస్ విశ్వ క్రీడలకు అర్హత సాధించారు. -
ISSF World Cup: అమ్మాయిలు అదరగొట్టారు.. పసిడి పతకంతో..
బాకు(అజర్బైజాన్): ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్ బంగారు బోనీ చేసింది. మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల టీమ్ ఈవెంట్లో ఇలవేనిల్ వలరివన్, రమిత, శ్రేయా అగర్వాల్‌లతో కూడిన భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో టీమిండియా 12-5 పాయింట్ల తేడాతో అనా నీల్సన్, ఎమ్మా కోచ్, రిక్కీ మెంగ్ ఇస్బెన్లతో కూడిన డెన్మార్క్ జట్టును ఓడించింది. ఇదిలా ఉంటే.. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత జట్టుకు నిరాశ ఎదురైంది. తెలంగాణ షూటర్ ధనుశ్ శ్రీకాంత్, రుద్రాక్ష్, పార్థ్‌లతో కూడిన భారత జట్టు కాంస్య పతక పోరులో 10-16తో క్రొయేషియా జట్టు చేతిలో ఓడిపోయింది. చదవండి: Rafael Nadal: జొకోవిచ్‌కు షాకిచ్చిన నాదల్.. వరల్డ్ నంబర్ 1కు ఘోర పరాజయం -
ISSF World Cup 2022: భారత్‌కు తొలి గోల్డ్ మెడల్.. అదరగొట్టిన సౌరభ్ చౌదరీ
Saurabh Wins Gold In ISSF World Cup In Cairo: సీనియర్ విభాగంలో తొలిసారి ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ యువ షూటర్ ఇషా సింగ్ అదరగొట్టింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 17 ఏళ్ల ఇషా సింగ్ రజత పతకం సొంతం చేసుకుంది. ఫైనల్లో ఇషా 4–16 పాయింట్ల తేడాతో ‘రియో ఒలింపిక్స్’ స్వర్ణ పతక విజేత అనా కొరాకాకి (గ్రీస్) చేతిలో ఓడిపోయింది. మరోవైపు పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ భాగంలో సౌరభ్ చౌదరీ భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించాడు. ఫైనల్లో సౌరభ్ 16–6తో మైకేల్ ష్వాల్డ్ (జర్మనీ)పై గెలిచాడు. 19 ఏళ్ల సౌరభ్‌కు ప్రపంచకప్ టోర్నీలలో ఇది మూడో పసిడి పతకం కావడం విశేషం. చదవండి: IND vs IRE: మూడేళ్ల తర్వాత ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా.. రోహిత్, కోహ్లి లేకుండానే! -
ఢిల్లీ ISSF షూటింగ్ ప్రపంచకప్ లో కోవిడ్ కలకలం
-
మా ఇలవేణి బంగారం; ఈ పసిడి ప్రత్యేకం!
రియో డి జెనిరో : భారత షూటర్ ఇలవేణి వలరివన్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్‌లో స్వర్ణ పతకం సాధించింది. బుధవారం రియో డి జెనిరో వేదికగా జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఆమె భారత్‌కు పతకాన్ని అందించింది. తద్వారా షూటింగ్ ప్రపంచ కప్ సిరీస్‌లో అంజలీ భగవత్, అపూర్వి చండేలా తర్వాత ఈ ఘనత సాధించిన(10 మీ ఎయిర్ రైఫిల్) మూడో మహిళా షూటర్‌గా నిలిచింది. ఈ నెల(ఆగస్టు 2)లోనే 20వ వసంతంలో అడుగుపెట్టిన ఈ కడలూరు అమ్మాయి సీనియర్ క్రీడాకారిణిగా బరిలో దిగిన రోజే పసిడిని సొంతం చేసుకోవడం విశేషం. కాగా బుధవారం నాడు జరిగిన పోటీలో 251.7 పాయింట్లు సాధించిన ఇలవేణి ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక బ్రిటన్‌కు చెందిన సియోనాయిడ్ కింటోష్(250.6), తైపీకి చెందిన లిన్ మాంగ్ చిన్(229.9) వరుసగా రజత, కాంస్య పతకాలతో ఇలవేణి తర్వాతి స్థానాల్లో నిలిచారు. కాగా సీనియర్ షూటర్, ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్ వద్ద ఇలవేణి షూటింగ్లో మెళకువలు నేర్చుకుంది. విజయానంతరం ఆమె మాట్లాడుతూ..‘మ్యాచ్‌కు ముందు కాస్త ఒత్తిడికి లోనయ్యాను. ఒలింపిక్ పతకం సాధించాలని మూడేళ్ల కిందటే లక్ష్యం పెట్టుకున్నాను. ప్రస్తుతం ఈ విజయం నాలో విశ్వాసం నింపింది. మా అకాడమీ గన్ ఫర్ గ్లోరీకి జాతీయ అవార్డు వచ్చిన రోజే నేను పసిడి సాధించడం ఎంతో గర్వంగా ఉంది. ఈ స్వర్ణం నాకెంతో ప్రత్యేకమైనది’ అని సంతోషం వ్యక్తం చేసింది. తాను ఈ పతకం సాధించడం వెనుక ఎందరో ప్రోత్సాహం ఉందని, వారందరికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ పతకాన్ని తన తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నట్టు పేర్కొంది. కాగా గత కొన్నేళ్లుగా దేశంలోని పలు నగరాల్లో షూటింగ్ కేంద్రాలను నెలకొల్పి..యువ షూటర్లకు శిక్షణ ఇస్తున్న గగన్ నారంగ్ సేవలను గుర్తించిన ప్రభుత్వం.. ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్’ అవార్డుకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇలవేణి వలరివన్.. కడలూరు జిల్లా తారామణికుప్పంకు చెందిన ఇలవేణి వలరివన్ కుటుంబం ఉద్యోగ రీత్యా ప్రస్తుతం అహ్మదాబాద్‌లో ఉంటున్నది. తమిళనాట కడలూరు జిల్లాలోనే కాదు, చెన్నైలోనూ ఆ కుటుంబానికి ఆప్తులు ఎక్కువే. అందుకే తమిళనాడుతోనే ఆ కుటుంబానికి అనుబంధం ఎక్కువ. బ్యాచిలర్ ఇన్ ఆర్ట్స్ (ఇంగ్లిçషు) చదువుతున్న ఇలవేణికి రైఫిల్ షూటింగ్లో చిన్నతనం నుంచి మక్కువ ఎక్కువే. తండ్రి వలరివన్ ఇచ్చిన ప్రోత్సాహం ఆమెను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. జూనియర్ పోటీల్లో రాణించే ప్రయత్నం చేసింది. అనేకమార్లు వెనక్కి తగ్గినా, ఏ మాత్రం ఢీలా పడకుండా ముందుకు సాగిన ఇలవేణి ప్రస్తుతం తమిళనాట బంగారంతో మెరిసింది. బ్రిజిల్ వేదికగా జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ ఎయిర్ రైఫిల్ షూటింగ్లో తన సత్తాని ఇలవేణి చాటుకుంది. పది మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో 251.7 పాయింట్లతో బంగారు పతకాన్ని కైవసం చేసుకుని తమిళ ఖ్యాతిని బ్రెజిల్ వేదికగా చాటింది. మా బంగారం ఇలవేణి.. తమ కుమార్తె పతకం సాధించడటం పట్ల వలరివన్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తమ పిల్లల్ని ఏదో ఒక క్రీడపై దృష్టి పెట్టే రీతిలో చర్యలు తీసుకోవాలని, అందులో వారిని ప్రోత్సహించాలని, సంపూర్ణ సహకారం అందించాలని ఇలవేణి తల్లిదండ్రులు సూచించారు. తన కుమార్తె ఒలింపిక్స్‌లో రాణించాలన్న లక్ష్యంతో ఉన్నదని అది సాకారం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక, తారామణి కుప్పంవాసులు అయితే, తమ గ్రామాన్ని ప్రపంచ స్థాయిలో ఇలవేణి నిలబెట్టినట్టు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. అక్కడి యువత బాణసంచాలు పేల్చుతూ ఇలవేణికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక్కడి ఇలవేణి కుటుంబీకులు, అత్త, అవ్వ మా ఇలవేణి బంగారం అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. First senior World Cup GOLD for @elavalarivan as India wins 3 of the four women’s 10m Air Rifle in all @ISSF_Shooting world cups this year. Incredible talent and phenomenal achievement. Many congratulations! #issfworldcuprio2019 pic.twitter.com/FN9DUurVJk — NRAI (@OfficialNRAI) August 28, 2019 -
వరల్డ్ కప్ షూటింగ్ : భారత్‌కు మరో స్వర్ణం
మ్యూనిక్ (జర్మనీ) : అంతర్జాతీయ షూటింగ్ క్రిడా సమాఖ్య (ఏఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత్ పతకాల పంట పండిస్తోంది. ఇప్పటికే అపూర్వి చండేలా రూపంలో భారత్‌కు ఒక స్వర్ణం రాగా.. సోమవారం మరో గోల్డ్ పతకం వచ్చి చేరింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో గురి తప్పని సౌరభ్ చౌదరీ.. భారత్ కు మరో గోల్డ్ అందించాడు. ఫైనల్లో మొత్తం 246.3 పాయింట్లతో తన పాత రికార్డును(245 పాయింట్లు) బద్దలు కొడుతూ సరికొత్త వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఫలితంగా ఈ టోర్నీలో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణం గెలుచుకున్న రెండో భారత షూటర్‌గా సౌరభ్ చౌదరి నిలిచాడు. (చదవండి : అపూర్వీ పసిడి గురి) ఆదివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో అపూర్వి చండేలా పసిడి పతకం సాధించిన విషయం తెలిసిందే. ఎనిమిది మంది షూటర్ల మధ్య 24 షాట్లతో ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అపూర్వీ 251 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
పసిడి పట్టిన జీతూ
ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ప్రపంచకప్‌లో భారత షూటర్లు గగనమే హద్దుగా చెలరేగిపోతున్నారు. రెండు రోజుల కిందట హీనా సిద్దూ, జీతూ రాయ్‌లు మిక్స్డ్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించారు. తాజాగా బుధవారం 50 మీటర్ల విభాగంలో జీతూరాయ్ పసిడికి గురి పెట్టాడు. ఇదే ఈవెంట్లో మరో భారత షూటర్ అమన్‌ప్రీత్ సింగ్ సిల్వర్ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. -
రియోకు నంజప్ప అర్హత
న్యూఢిల్లీ : షూటర్ ప్రకాశ్ నంజప్ప వచ్చే ఏడాది రియో డి జనీరోలో జరిగే ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. అజెర్బైజాన్లో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లో పురుషుల 50మీ. పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో తను ఎనిమిదో స్థానంలో నిలిచి ఒలింపిక్స్‌కు అర్హత పొందాడు. 39 ఏళ్ల ప్రకాశ్ భారత్ నుంచి రియోకు అర్హత సాధించిన ఆరో షూటర్. క్వాలిఫికేషన్లో 567 పాయింట్లు సాధించి రెండో స్థానంతో ఫైనల్స్‌కు చేరిన నంజప్ప... అక్కడ 70.1 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచి ఎలిమినేట్ అయ్యాడు. అయితే అప్పటికే తను రియో బెర్త్ ఖాయం చేసుకున్నాడు. మరో షూటర్ జితూ రాయ్ ఫైనల్స్‌లో నాలుగో స్థానం దక్కించుకున్నాడు. నంజప్పకు ముందు ఒలింపిక్ అవకాశం పొందిన షూటర్లలో బింద్రా, గగన్, అపూర్వి చండేలా, గుర్ప్రీత్ సింగ్, జితూ రాయ్ ఉన్నారు. -
షూటర్ జీతూకు స్వర్ణం
న్యూఢిల్లీ: భారత షూటర్ జీతూ రాయ్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించాడు. స్లొవేనియాలోని మారిబోర్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్ ఎయిర్ పిస్టల్ విభాగం ఫైనల్ రౌండ్లో 200.8 పాయింట్లతో స్వర్ణం దక్కించుకున్నాడు. ఈ పతకంతో పాటు ఇంతకుముందే ఫ్రీ పిస్టల్‌లో రజతం సాధించిన జీతూ ప్రపంచకప్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు. ఇదే ఈవెంట్లో పాల్గొన్న మరో భారత షూటర్ పీఎన్ ప్రకాశ్ ఐదో స్థానంలో నిలిచాడు. మరోవైపు మ్యూనిచ్‌లో జరిగిన చివరి ప్రపంచకప్‌లోనూ జీతూ ఎయిర్ పిస్టల్‌లో రజతం దక్కించుకున్నాడు.