వరల్డ్ కప్ షూటింగ్ : భారత్‌కు మరో స్వర్ణం | Saurabh Chaudhary WOn 10m Air Pistol Gold In ISSF World Cup | Sakshi
Sakshi News home page

వరల్డ్ కప్ షూటింగ్ : భారత్‌కు మరో స్వర్ణం

May 27 2019 7:59 PM | Updated on May 27 2019 8:02 PM

Saurabh Chaudhary WOn 10m Air Pistol Gold In ISSF World Cup - Sakshi

మ్యూనిక్‌ (జర్మనీ) : అంతర్జాతీయ షూటింగ్‌ క్రిడా సమాఖ్య (ఏఎస్‌ఎస్‌ఎఫ్‌) ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో భారత్ పతకాల పంట పండిస్తోంది. ఇప్పటికే అపూర్వి చండేలా రూపంలో భారత్‌కు ఒక స్వర్ణం రాగా.. సోమవారం మరో గోల్డ్‌ పతకం వచ్చి చేరింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో గురి తప్పని సౌరభ్ చౌదరీ.. భారత్ కు మరో గోల్డ్ అందించాడు. ఫైనల్లో మొత్తం 246.3 పాయింట్లతో తన పాత రికార్డును(245 పాయింట్లు) బద్దలు కొడుతూ సరికొత్త వరల్డ్‌ రికార్డు నెలకొల్పాడు. ఫలితంగా ఈ టోర్నీలో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో స్వర్ణం గెలుచుకున్న రెండో భారత షూటర్‌గా సౌరభ్ చౌదరి నిలిచాడు.

(చదవండి : అపూర్వీ పసిడి గురి)

ఆదివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో అపూర్వి చండేలా పసిడి పతకం సాధించిన విషయం తెలిసిందే. ఎనిమిది మంది షూటర్ల మధ్య 24 షాట్‌లతో ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అపూర్వీ 251 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement