రియోకు నంజప్ప అర్హత | Nanjappa to qualify for Rio | Sakshi
Sakshi News home page

రియోకు నంజప్ప అర్హత

Aug 11 2015 11:25 PM | Updated on Sep 3 2017 7:14 AM

రియోకు నంజప్ప అర్హత

రియోకు నంజప్ప అర్హత

షూటర్ ప్రకాశ్ నంజప్ప వచ్చే ఏడాది రియో డి జనీరోలో జరిగే ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు

న్యూఢిల్లీ : షూటర్ ప్రకాశ్ నంజప్ప వచ్చే ఏడాది రియో డి జనీరోలో జరిగే ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. అజెర్‌బైజాన్‌లో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో పురుషుల 50మీ. పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో తను ఎనిమిదో స్థానంలో నిలిచి ఒలింపిక్స్‌కు అర్హత పొందాడు. 39 ఏళ్ల ప్రకాశ్ భారత్ నుంచి రియోకు అర్హత సాధించిన ఆరో షూటర్. క్వాలిఫికేషన్‌లో 567 పాయింట్లు సాధించి రెండో స్థానంతో ఫైనల్స్‌కు చేరిన నంజప్ప... అక్కడ 70.1 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచి ఎలిమినేట్ అయ్యాడు.

అయితే అప్పటికే తను రియో బెర్త్ ఖాయం చేసుకున్నాడు. మరో షూటర్ జితూ రాయ్ ఫైనల్స్‌లో నాలుగో స్థానం దక్కించుకున్నాడు. నంజప్పకు ముందు ఒలింపిక్ అవకాశం పొందిన షూటర్లలో బింద్రా, గగన్, అపూర్వి చండేలా, గుర్‌ప్రీత్ సింగ్, జితూ రాయ్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement