టాప్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు! | jadeja maintains top position | Sakshi
Sakshi News home page

టాప్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు!

Aug 1 2017 4:23 PM | Updated on Sep 17 2017 5:03 PM

టాప్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు!

టాప్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు!

తర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ బౌలింగ్ విభాగంలో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన టాప్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు.

దుబాయ్:అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ బౌలింగ్ విభాగంలో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన టాప్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్ లో జడేజా(897 రేటింగ్) పాయింట్లతో ప్రథమ స్థానాన్ని కాపాడుకున్నాడు. పాయింట్ల పరంగా ఒక పాయింట్ ను కోల్పోయిన జడేజా తన ర్యాంకును మాత్రం పదిలంగా ఉంచుకున్నాడు. మరొకవైపు అశ్విన్ తిరిగి రెండో స్థానానికి ఎగబాకాడు. పదిరోజుల క్రితం విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో మూడో ర్యాంకుకు పడిపోయిన అశ్విన్.. మళ్లీ రెండో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే శ్రీలంక స్పిన్నర్ రంగనా హెరాత్ ను వెనక్కునెట్టాడు.

 

ఇదిలా ఉంచితే, బ్యాటింగ్ విభాగంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఐదోస్థానంలో కొనసాగుతుండగా, చటేశ్వర పుజారా నాల్గో స్థానంలో నిలిచాడు. మరొకవైపు శ్రీలంకతో తొలి టెస్టులో రాణించిన శిఖర్ ధావన్ 21 స్థానాలు ఎగబాకి 39 ర్యాంకులో నిలిచాడు. ఇక్కడ ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలి స్థానంలో, ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ రెండో స్థానంలో కొనసాగుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement