రవీంద్ర జడేజా రికార్డు | JADEJA Fewest Tests to 150 wickets by left-arm spinners | Sakshi
Sakshi News home page

రవీంద్ర జడేజా రికార్డు

Aug 5 2017 11:58 AM | Updated on Nov 9 2018 6:43 PM

రవీంద్ర జడేజా రికార్డు - Sakshi

రవీంద్ర జడేజా రికార్డు

టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో నంబర్ ర్యాంకులో కొనసాగుతున్న భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

కొలంబో:టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో నంబర్ ర్యాంకులో కొనసాగుతున్న భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. శ్రీలంకతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు సాధించిన జడేజా.. 150వ టెస్టు వికెట్ ను సాధించాడు. తద్వారా అత్యంత తక్కువ టెస్టుల్లో ఈ మార్కును చేరిన లెఫ్టార్మ్ స్పిన్నర్లలో జడేజా తొలి స్థానంలో నిలిచాడు.

 

ఇక్కడ వినోద్ మన్కడ్ , టీ లాక్, డెరిక్ అండర్ వుడ్, రంగనా హెరాత్  లను ను జడేజా అధిగమించాడు. వీరంతా 40 టెస్టుల్లో 150 వికెట్లు సాధించిన లెఫ్టార్మ్ స్పిన్నర్లు. లంక  ఇన్నింగ్స్ లో భాగంగా ఈ రోజు ఆటలో  డిసిల్వాను పెవిలియన్ కు పంపడం ద్వారా జడేజా 150వ టెస్టు వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు కెప్టెన్ చండిమాల్ ను జడేజా అవుట్ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement