హైదరాబాద్‌లో ప్లే ఆఫ్‌ మ్యాచ్‌!

IPL 2019 playoff venues floating sponsorship tender on agenda in upcoming CoA meeting - Sakshi

నేడు నిర్ణయం

న్యూఢిల్లీ:  ఐపీఎల్‌ ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ల వేదికలను ఖరారు చేసేందుకు బీసీసీఐ క్రికెట్‌ పరిపాలకుల కమిటీ (సీఓఏ) నేడు సమావేశం కానుంది. సీఓఏ సభ్యులతో పాటు బోర్డు తాత్కాలిక అధ్యక్ష, కార్యదర్శులు సీకే ఖన్నా, అమితాబ్‌ చౌదరి, కోశాధికారి అనిరుధ్‌ చౌదరి ఈ సమావేశంలో పాల్గొంటారు. ఐపీఎల్‌ ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ల వేదికలను ఖరారు చేయడంతో పాటు ఇతర విషయాలపై కూడా చర్చ జరగనుంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ల (రెండు క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు, ఎలిమినేటర్‌ మ్యా చ్‌) వేదికలుగా హైదరాబాద్, చెన్నై ఖరారయ్యే అవకాశం ఉంది. ముంబైలో ఫైనల్‌ నిర్వహించాలని బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు బీసీసీఐ మ్యాచ్‌లకు టైటిల్‌ స్పాన్సర్‌గా పేటీఎం గడువు ముగిసిపోయింది. దాంతో కొత్త స్పాన్సర్‌ కోసం టెండర్లను కోరే అంశంపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. మహిళా క్రికెటర్లతో మినీ ఐపీఎల్‌ నిర్వహించడంపై కూడా చర్చ జరగవచ్చు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top