ఐపీఎల్‌-2019: సమ ఉజ్జీల పోరు.. గెలుపెవరిదీ?

IPL 2019 Can Mumbai Indians Stop CSK Victory Juggernaut At Wankhede - Sakshi

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-2019లో మరో రసవత్తపోరుకు స్థానిక వాంఖెడే మైదానం సిద్దమైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఓటమెరుగని డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)తో ముంబై ఇండియన్స్‌ తలపడుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సీఎస్‌కే ఫీల్డింగ్‌ ఎంచుకుంది. డబుల్‌ హ్యాట్రిక్‌పై కన్నేసిన సీఎస్‌కే ఈ మ్యాచ్‌లో ఒక్క మార్పు చేసింది. సాంటర్న్‌ స్థానంలో మోహిత్‌ శర్మను తుది జట్టులో తీసుకుంది. ముంబై ఇండియన్స్‌లో కూడా రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. మయాంక్‌ మార్కండే, మెక్లీన్‌గాన్‌ స్థానాలలో రాహుల్‌ చహర్‌, బెహ్రన్‌డార్ఫ్‌లకు అవకాశం కల్పించారు. 

ఇక హ్యాట్రిక్‌ విజయాలతో జోరు మీదున్న సీఎస్‌కేకు అడ్డుకట్టవేయాలని రోహిత్‌ సేన ఆరాటపడుతోంది. ఇదే ఊపును కొనసాగించాలని సీఎస్‌కే భావిస్తోంది. అయితే ఐపీఎల్‌లో సీఎస్‌కేకు మంచి రికార్డు ఉన్నప్పటికీ ముంబైతో మాత్రం ఆ జట్టుది పేలవ ప్రదర్శనే. రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల గణంకాలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఐపీఎల్‌లో ఈ రెండు జట్ల మధ్య ముఖా ముఖి పోరులో ముంబై 14, చెన్నై 12 గెలిచాయి. గత ఐదు మ్యాచ్‌ల్లో ముంబై ఏకంగా నాలిగింటిని సొంతం చేసుకోగా, సీఎస్‌కేకి ఒకటి మాత్రమే దక్కింది. ఈ ప్రకారం చూస్తే నేటి మ్యాచ్‌లో రోహిత్‌ సేనకే విజయావకాశాలు కనిపిస్తున్నాయి.

తుదిజట్లు
ముంబై : రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), డికాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, యువరాజ్‌ సింగ్‌, పొలార్డ్‌, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, రాహుల్‌ చహర్‌, జస్ప్రిత్‌ బుమ్రా, లసింత్‌ మలింగ, బెహ్రన్‌డార్ఫ్‌

సీఎస్‌కే: ఎంఎస్‌ ధోని(కెప్టెన్‌), అంబటి రాయుడు, షేన్‌ వాట్సన్‌, సురేష్‌ రైనా, కేదార్‌ జాదవ్‌, డ్వేన్‌ బ్రేవో, రవీంద్ర జడేజా, దీపక్‌ చహర్‌, మోహిత్‌ శర్మ, శార్దూల్‌ ఠాకూర్‌, ఇమ్రాన్‌ తాహీర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top