భారత రెజ్లర్ల పసిడి పట్టు | Indian wrestler to hold gold | Sakshi
Sakshi News home page

భారత రెజ్లర్ల పసిడి పట్టు

Nov 7 2016 12:25 AM | Updated on Sep 4 2017 7:23 PM

భారత రెజ్లర్ల పసిడి పట్టు

భారత రెజ్లర్ల పసిడి పట్టు

కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు.

న్యూఢిల్లీ: కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. సింగపూర్‌లో ఆదివారం ముగిసిన ఈ ఈవెంట్‌లో చివరిరోజు భారత కుస్తీ వీరులు 8 స్వర్ణాలు, 8 రజతాలు సొంతం చేసుకున్నారు. పురుషుల ఫ్రీస్టరుుల్ విభాగంలో హర్‌ఫుల్ (61 కేజీలు), బజరంగ్ (65 కేజీలు), జితేందర్ (74 కేజీలు), దీపక్ (86 కేజీలు), హితేందర్ (125 కేజీలు) స్వర్ణ పతకాలను దక్కించుకున్నారు.

వికాస్ (61 కేజీలు), రాహుల్ మాన్ (65 కేజీలు), సందీప్ (74 కేజీలు), అరుణ్ (86 కేజీలు), కృషన్ (125 కేజీలు) రజత పతకాలు గెలిచారు. పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో రవీందర్ (59 కేజీలు), దీపక్ (71 కేజీలు), హర్‌దీప్ (98 కేజీలు) పసిడి పతకాలను కై వసం చేసుకున్నారు. కృషన్ (59 కేజీలు), రఫీక్ (71 కేజీలు), సచిన్ (98 కేజీలు) రజత పతకాలను సాధించారు.  

Advertisement
 
Advertisement
Advertisement