పసిడి పోరుకు నిఖత్‌ | Indian boxers Nikhat Zarine at the International Boxing Tournament | Sakshi
Sakshi News home page

పసిడి పోరుకు నిఖత్‌

Feb 19 2019 4:45 AM | Updated on Feb 19 2019 4:45 AM

Indian boxers Nikhat Zarine at the International Boxing Tournament - Sakshi

సోఫియా (బల్గేరియా): స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత బాక్సర్లు నిఖత్‌ జరీన్‌ (51 కేజీలు), అమిత్‌ పంగల్‌ (49 కేజీలు), మంజు రాణి (48 కేజీలు), మీనా కుమారి దేవి (54 కేజీలు) స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించారు. సోమవారం జరిగిన సెమీఫైనల్స్‌లో తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ 3–2తో సాండ్రా డ్రాబిక్‌ (పోలాండ్‌)పై... అమిత్‌ 3–2తో సైద్‌ మొర్తాజీ (మొరాకో)పై గెలిచారు. ఇతర బౌట్స్‌లో ఎమి మారి తొడొరోవా (బల్గేరియా)పై మంజు రాణి... ఎకతెరీనా సిచెవా (రష్యా)పై మీనా విజయం సాధించారు. మరోవైపు ప్విలావో బాసుమతారి (64 కేజీలు), నీరజ్‌ (60 కేజీలు), లవ్లీనా బొర్గొహైన్‌ (69 కేజీలు) సెమీఫైనల్లో పరాజయం పాలై కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు.    

Advertisement
 
Advertisement
Advertisement