ఇంగ్లండ్పై భారత్ ఘన విజయం | india won first oneday with england | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్పై భారత్ ఘన విజయం

Jan 15 2017 9:32 PM | Updated on Sep 5 2017 1:17 AM

ఇంగ్లండ్పై భారత్ ఘన విజయం

ఇంగ్లండ్పై భారత్ ఘన విజయం

ఇంగ్లండ్ భారత్ మధ్య జరిగిన తొలివన్డేలో పరుగుల వరద పారింది.

పుణె:
ఇంగ్లండ్, భారత్ మధ్య జరిగిన తొలివన్డేలో పరుగుల వరద పారింది. జాదవ్ వీర విహారానికి, కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ తోడవడంతో ఓ దశలో ఓటమి అంచుల వరకు వెళ్లిన భారత్, ఇంగ్లండ్పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్, భారత్ ఎదుట 351 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియాకు మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది. విల్లీ బౌలింగ్‌లో ఓపెనర్లు ధవన్ (1), లోకేష్‌ రాహుల్‌ (8)వెంటవెంటనే అవుటవగా.. సీనియర్లు యువరాజ్‌ (15), ధోనీ (6) కూడా నిరాశపరిచారు. స్టోక్స్ బౌలింగ్‌లో యువీ, జేక్‌ బాల్‌ ఓవర్లో ధోనీ పెవిలియన్‌ చేరారు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన కేదార్‌ జాదవ్‌, విరాట్‌ కోహ్లీతో కలిసి ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కీలక సమయంలో జాదవ్ 120 పరుగులు‌(76 బంతుల్లో,12ఫోర్లు, 4సిక్సులు) మెరుపు సెంచరీకి తోడు, కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 122 పరుగులు(105 బంతుల్లో, 8 ఫోర్లు, 5 సిక్సులు)తో చెలరేగారు.

కోహ్లీకి వన్డేల్లో 27వ సెంచరీ కాగా,  జాదవ్‌ కిది రెండో శతకం. 12 ఓవర్లలో 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత్ను విరాట్‌, జాదవ్‌లు ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు కీలక 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయం దిశగా నడిపించారు. స్టోక్స్ బౌలింగ్లో విరాట్‌ క్యాచ్ అవుటయ్యాడు. జట్టు 291 పరుగుల వద్ద జాదవ్ దూకుడుగా ఆడబోయి జేటీ బాల్ బౌలింగ్లో  స్టోక్స్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. జడేజా(13) నిరాశ పరిచినా పాండ్యా(40), అశ్విన్(15) సమయోచితంగా ఆడటంతో భారత్ తొలి వన్డేలో మూడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ పై ఘనవిజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్‌ పూర్తి ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. చివరి 8 ఓవర్లలో ఇంగ్లండ్‌ 70 వరకు పరుగులు చేసే అవకాశముందని భావించారు. భారత బౌలర్లు రాణిస్తే 300 స్కోరుకు కాస్త అటూ ఇటుగా ఇంగ్లండ్‌ను కట్టడి చేయవచ్చని ఊహించారు. అయితే సీన్‌ రివర్సయింది. చివరి 8 ఓవర్లలో భారత బౌలర్లు చేతులెత్తేయగా, ఇంగ్లండ్‌ బ్యాట్స్మెన్‌ ఇరగదీశారు. దీంతో మ్యాచ్‌ టీ-20లా సాగింది.

చివర్లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా ధారాళంగా పరుగులిచ్చేశాడు. బుమ్రా బౌలింగ్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు నాలుగు సిక్సర్లు, ఫోర్‌ బాదారు. ఇక ఉమేష్ యాదవ్‌ బౌలింగ్‌లో మూడు ఫోర్లు, సిక్సర్ కొట్టారు. అశ్విన్‌ కూడా ఓ ఓవర్లో 4, 6 సమర్నపించుకున్నాడు. దీంతో ఇంగ్లండ్‌ స్కోరు బోర్డు వేగంగా పరుగులు పెట్టింది. పూర్తి ఓవర్లు అయ్యే సరికి ఇంగ్లండ్‌ 7 వికెట్లకు 350 పరుగులు చేసి టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆఖరి 8 ఓవర్లలో ఇంగ్లండ్‌ 2 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. చివర్లో భారత బౌలర్లు రెండు వికెట్లు తీసినా పరుగులను కట్టడి చేయలేకపోయారు. జాసన్ రాయ్(73; 61 బంతుల్లో 12 ఫోర్లు), జో రూట్(78; 95 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్), బెన్ స్టోక్స్(62) హాఫ్‌ సెంచరీలతో రాణించగా, మోర్గాన్ (28), బట్లర్ (31), అలీ (28)లు ఫర్వాలేదనిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement