గేల్‌ ఆడటం లేదు! | India vs West Indies: No Chris Gayle for ODI series | Sakshi
Sakshi News home page

గేల్‌ ఆడటం లేదు!

Oct 9 2018 1:00 AM | Updated on Oct 9 2018 1:00 AM

 India vs West Indies: No Chris Gayle for ODI series - Sakshi

అంటిగ్వా: భారత్‌తో ఐదు వన్డేలు, మూడు టి 20ల సిరీస్‌లలో తలపడే వెస్టిండీస్‌ జట్లను సోమవారం ప్రకటించారు. విధ్వంసక ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ వ్యక్తిగత కారణాలతో రెండు ఫార్మాట్లకు దూరం కాగా, ఆల్‌రౌండర్లు కీరన్‌ పొలార్డ్, ఆండ్రీ రస్సెల్‌లకు టి20 జట్టులో చోటుదక్కింది. ఎడమ చేతివాటం బ్యాట్స్‌మన్‌ డారెన్‌ బ్రావో చాలా కాలం తర్వాత పొట్టి ఫార్మాట్‌తో పునరాగమనం చేస్తున్నాడు. గేల్‌... బంగ్లాదేశ్‌తో సిరీస్‌కూ అందుబాటులో ఉండడని, అయితే, స్వదేశంలో ఇంగ్లండ్‌ సిరీస్, 2019 వన్డే ప్రపంచ కప్‌ ఆడతాడని వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు సెలక్షన్‌ కమిటీ (డబ్ల్యూఐసీబీ) చైర్మన్‌ కోట్నీ బ్రౌన్‌ తెలిపారు.

ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ చంద్రపాల్‌ హేమ్‌రాజ్, ఆల్‌రౌండర్లు ఫాబియాన్‌ అలెన్, షెర్ఫేన్‌ రూథర్‌ఫర్డ్, పేసర్‌ ఒషేన్‌ థామస్, ఒబెద్‌ మెక్‌కాయ్, క్యారీ పియరీ కొత్తగా జట్టుకు ఎంపికయ్యారు. వన్డేలకు జాసన్‌ హోల్డర్, టి20లకు కార్లొస్‌ బ్రాత్‌వైట్‌ సారథ్యం వహిస్తారు. వన్డే సిరీస్‌కు ముందు విండీస్‌ గువాహటిలో సన్నాహక శిబిరంలో పాల్గొంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement