'భారత జట్టుకు మేమంటే భయం' | India Scared of Pakistan After Champions Trophy Loss | Sakshi
Sakshi News home page

'భారత జట్టుకు మేమంటే భయం'

Jul 7 2017 12:03 PM | Updated on Sep 5 2017 3:28 PM

'భారత జట్టుకు మేమంటే భయం'

'భారత జట్టుకు మేమంటే భయం'

గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్లు ఆడటానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)మొగ్గు చూపని సంగతి తెలిసిందే.

కరాచీ: గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్లు ఆడటానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)మొగ్గు చూపని సంగతి తెలిసిందే. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్ తో ఎటువంటి క్రీడా సంబంధాలు పెట్టుకోవడానికి భారత్ ఆసక్తి చూపడం లేదు. ఆ దేశం ఉగ్రవాద చర్యలకు ఫుల్ స్టాప్ పెట్టినప్పుడే వారితో సిరీస్లు ఆడతామని భారత ప్రభుత్వం చెబుతున్న మాట.  దాంతో పాకిస్తాన్ తో మ్యాచ్ లకు బీసీసీఐ ముందుకు వెళ్లడం లేదు.

 

అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ షహర్యార్ ఖాన్ మాత్రం కొత్త పల్లవి అందుకున్నారు. తమతో క్రికెట్ ఆడటం అంటే భారత్ జట్టుకు భయమని, అందుకే ఎటువంఇ ఆసక్తిని కనబరచడం లేదన్నారు. ఇక్కడ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్ చేతిలో భారత్ ఓడిపోవడాన్ని షహర్యార్ ప్రస్తావించారు. తమతో మ్యాచ్ లు ఆడినప్పుడు ఆ తరహా  ఓటముల్ని భారత్ చవిచూడాల్సి వస్తుందనే భయంతోనే వెనుకడుగు వేస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement