సెమీస్‌లో ప్రసాద్‌  | India Open International Boxing Tournament | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో ప్రసాద్‌ 

May 23 2019 12:42 AM | Updated on May 23 2019 12:42 AM

India Open International Boxing Tournament - Sakshi

గువాహటి: ఇండియా ఓపెన్‌ అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ బాక్సర్‌ పొలిపల్లి లలితా ప్రసాద్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన పురుషుల 52 కేజీల విభాగం క్వార్టర్‌ ఫైనల్లో నేపాల్‌కు చెందిన తేజ్‌ బహదూర్‌ దేబాపై ప్రసాద్‌ విజయం సాధించాడు. ఇదే విభాగంలో భారత్‌కే చెందిన ఆసియా చాంపియన్‌ అమిత్‌ ఫంగల్, సచిన్‌ సివాచ్, గౌరవ్‌ సోలంకి కూడా సెమీఫైనల్‌కు చేరారు. దాంతో ఈ విభాగంలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు భారత్‌ ఖాతాలోకే చేరనున్నాయి.    

Advertisement
 
Advertisement
Advertisement