ఓడిన భారత్.. సిరీస్ ఆస్ట్రేలియాకే | india lost third one day also | Sakshi
Sakshi News home page

ఓడిన భారత్.. సిరీస్ ఆస్ట్రేలియాకే

Jan 17 2016 4:35 PM | Updated on Sep 3 2017 3:48 PM

ఓడిన భారత్.. సిరీస్ ఆస్ట్రేలియాకే

ఓడిన భారత్.. సిరీస్ ఆస్ట్రేలియాకే

ముచ్చటగా మూడోసారి భారత్ ఓడింది. మూడో వన్డేలో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.

మెల్ బోర్న్: ముచ్చటగా మూడోసారి భారత్ ఓడింది. మూడో వన్డేలో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. రెండో వన్డే లో ఓటమి పాలైన అనంతరం కనీసం 330 పరుగులు చేస్తామని చెప్పిన కెప్టెన్ ధోనీ 295 పరుగుల చేసి 296 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందుంచగా ఆచితూడి ఆడిన ఆస్ట్రేలియా మూడో వన్డేలో కూడా విజయాన్ని సాధించి సిరీస్ కైవసం చేసుకుంది.

ఆస్ట్రేలియా ఇండియాల మధ్య ఐదు వన్డేల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం మూడో వన్డే ప్రారంభం కాగా టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 295 పరుగులు చేసింది. ఆసీస్ ముందు 296 పరుగుల టార్గెట్ ఉంచింది. విరాట్ కోహ్లి సెంచరీకి తోడు ధావన్(68) రహానే(50) అర్థసెంచరీలతో రాణించారు.

ఇక, అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా48.5 ఓవర్లలో296 పరుగులు చేసి 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ లలో మ్యాక్స్ వెల్ 96, ఎస్ఈ మార్ష్ 62, స్మిత్ 41, బైలీ 23 పరుగులతో రాణించారు. ఇక, ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్ కు తలా రెండు వికెట్లు దక్కాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement