'టీ 20 క్రికెట్ లో టీమిండియా మెరుగ్గా ఉంది' | India are much better balanced in T20 cricket, says Dean Jones | Sakshi
Sakshi News home page

'టీ 20 క్రికెట్ లో టీమిండియా మెరుగ్గా ఉంది'

Jan 24 2016 8:26 PM | Updated on Sep 3 2017 4:15 PM

'టీ 20 క్రికెట్ లో టీమిండియా మెరుగ్గా ఉంది'

'టీ 20 క్రికెట్ లో టీమిండియా మెరుగ్గా ఉంది'

టీమిండియా జట్టు ట్వంటీ 20 క్రికెట్ లో సమతుల్యంగా ఉందని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డీన్ జోన్స్ అభిప్రాయపడ్డాడు.

అడిలైడ్: ట్వంటీ 20  క్రికెట్ లో టీమిండియా జట్టు సమతుల్యంగా ఉందని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డీన్ జోన్స్ అభిప్రాయపడ్డాడు. త్వరలో ఆస్ట్రేలియాతో జరగబోయే  ట్వంటీ 20 సిరీస్ కు ఎంపిక చేసిన టీమిండియా జట్టు చాలా మెరుగ్గా ఉందన్నాడు. మంచి మ్యాచ్ ఫినిషర్ గా పేరున్న కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మిడిల్ ఉండటంతో పాటు, స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ ట్వంటీ 20 జట్టుతో కలవబోతుండటంతో టీమిండియా జట్టుకు అదనపు బలమన్నాడు. 

 

ఆసీస్ తో వన్డే సిరీస్ ను కోల్పోయినా అది ధోని సేనపై పెద్దగా ప్రభావం చూపే అవకాశం ఉండదన్నాడు. ప్రస్తుతం టీమిండియా దృష్టంతా ట్వంటీ 20 సిరీస్ పైనే ఉందన్నాడు.  ట్వంటీ20 వరల్డ్ కప్ కు ఎనిమిది వారాలే సమయం ఉన్నందున టీమిండియాకు ఈ సిరీస్ ను సాధించడమే ప్రధానమన్నాడు. వన్డేల్లో పలు రకాల ప్రయోగాలు చేసిన టీమిండియా ..  ట్వంటీ 20 సిరీస్ గెలవడానికి తీవ్రంగా శ్రమిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని  పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement