రాహులా.. ఇదే కదా అదృష్టం!

IND Vs NZ: KL Rahul Gets Lucky Two Run Out Chances Missed - Sakshi

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత్‌ ఆదిలోనే వికెట్‌ను కోల్పోయింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(7) నిరాశపరిచాడు. సిక్స్‌ కొట్టి ఊపుమీద కనిపించినా సాంట్నార్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. సాంట్నార్‌ వేసిన రెండో ఓవర్‌ నాల్గో బంతికి రాస్‌ టేలర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. కాగా, మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్ అదృష్టం కలిసొచ్చింది. బెన్నెట్‌ వేసిన ఆరో ఓవర్‌ రెండో బంతిని కవర్స్‌లోకి ఆడాడు. దానికి నాన్‌ స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న కోహ్లి పరుగు కోసం రాగా, రాహుల్ తటపటాయించాడు. అయితే కోహ్లి తన నిర్ణయాన్ని మార్చుకోకుండా ముందుకు సాగడంతో రాహుల్‌ క్రీజ్‌ను వదిలి రాకతప్పలేదు. 

ఈ క్రమంలోనే రెండుసార్లు రనౌట్‌ అయ్యే ప‍్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ముందుగా బౌలర్‌ బెన్నెట్‌ డైరెక్ట్‌ హిట్‌ కోసం యత్నించగా అది మిస్‌ అయ్యింది. అప్పటికి రాహుల్‌ పిచ్‌ సగం కూడా దాటలేదు. ఆపై మిడ్‌ వికెట్‌ ఫీల్డర్‌ మళ్లీ బంతిని వికెట్లపైకి వేయగా అది కూడా తగల్లేదు. దాంతో రాహుల్‌ బతికిపోయాడు. ఎలాగో రనౌట్‌ నుంచి తప్పించుకోవడంతో రాహుల్‌ ఊపిరి తీసుకున్నాడు. ఇక రాహులా.. ఇదే కదా అదృష్టం అనుకోవడం అభిమానుల వంతైంది. ఆ సమయానికి రాహుల్‌ 27 పరుగుల వద్ద ఉండగా, అటు తర్వాత హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో అర్థ శతకం సాధించాడు. కాగా, 56 వ్యక్తిగత పరుగుల వద్ద రాహుల్‌ రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఇష్‌ సోథీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు  యత్నించి సౌతీ క్యాచ్‌ పట్టడంతో ఔటయ్యాడు.(ఇక్కడ చదవండి: విలియమ్సన్‌కు పూనకం..)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top