‘ఐసీసీ క్షమాపణలు చెప్పాలి’

ICC should apologise to Dhoni and all of India, says Sreesanth - Sakshi

న్యూఢిల్లీ:  వన్డే ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో భారత క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని కీపింగ్‌ గ్లౌజ్‌పై ఉన్న ‘బలిదాన్‌ బ్యాడ్జ్‌’ (ఆర్మీకి చెందిన ప్రత్యేకమైన లోగో) తొలగించాలంటూ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) సూచించడంపై క్రికెటర్‌ శ్రీశాంత్‌ మండిపడ్డాడు. ఈ విషయంలో ధోనితో పాటు భారత్‌కు ఐసీసీ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌ చేశాడు.  ఇక్కడ ధోనికి యావత్‌ భారతదేశం అండగా నిలవాలంటూ విజ్ఞప్తి చేశాడు.  ‘భారత్‌ మిలటరీకి ధోని ఎంత గౌరవం ఇస్తాడో అందరికీ తెలుసు.
(ఇక్కడ చదవండి: ఆ లోగో తీయాల్సిన అవసరం లేదు: బీసీసీఐ)

అదే సమయంలో ఒంటి చేత్తో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించిన ఘనత ధోని. కేవలం ఒకటో-రెండో వరల్డ్‌కప్‌లకే ధోని పరిమితం కాలేదు. ప్రపంచ క్రికెట్‌లో తనదైన ముద్ర వేస్తూ భారత్‌ క్రికెట్‌కు వన్నె తెచ్చాడు. ఈ సమయంలో ప్రతీ భారతీయుడు ధోనికి అండగా నిలుస్తారనే అనుకుంటున్నా. ఐసీసీ కూడా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందనే అనుకుంటున్నా. భారత్‌ ప్రజలను క్షమపణలు కోరుతూ లేఖ రాయాలి’ అని శ్రీశాంత్‌ పేర్కొన్నాడు. ఇక బెంగాల్‌ క్రికెటర్‌ మనోజ్‌ తివారీ మాట్లాడుతూ.. ‘చాలా సందర్భాల్లో ఆటగాళ్లు వివిధ రకాలైన క్యాప్‌లను ధరిస్తూ ఉంటారు. అటువంటప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకొచ్చింది’ ప్రశ్నించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top