ఆ లోగో తీయాల్సిన అవసరం లేదు: బీసీసీఐ

MS Dhoni Not To Remove Insignia From Gloves, Says COA - Sakshi

సౌతాంప్టన్‌: వన్డే ప్రపంచకప్‌లో భారత క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని కీపింగ్‌ గ్లౌజ్‌పై ఉన్న ‘బలిదాన్‌ బ్యాడ్జ్‌’ (ఆర్మీకి చెందిన ప్రత్యేకమైన లోగో) ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ విశేషాల కంటే కూడా ధోని ధరించిన ఆ గ్లౌజ్‌పై ఎక్కువ చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే ధోని గ్లౌజ్‌పై ఉన్న లోగోను తొలగించాల్సిందిగా బీసీసీఐకి ఐసీసీ విజ్ఞప్తి కూడా చేసింది.  దీనిపై తాజాగా స్పందించిన భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు.. ధోని  ధరించిన గ్లౌజ్‌పై ఉన్న లోగోను తొలగించాల్సిన అవసరం లేదంటూ స్పష్టం చేసింది.
(ఇక్కడ చదవండి: ప్రపంచకప్‌ నుంచి వెనక్కొచ్చేయండి!)

అది అసలు ఆర్మీకి చెందిన గుర్తు కాదని బీసీసీఐ పరిపాలక కమిటీ(సీఓఏ) పేర్కొంది. ఈ మేరకు సీఓఏ చీఫ్‌ వినోద్‌ రాయ్‌. మాట్లాడుతూ.. ఇదే విషయాన్ని ఐసీసీకి తెలియజేసినట్లు పేర్కొన్నారు. ‘ ధోని ధరించిన గ్లౌజ్‌పై ఉన్న లోగో మిలటరీ సింబల్‌ కాదు. దీనిపై రాద్ధాంతం అనవసరం. ఐసీసీ నిబంధనల్ని ధోని అతిక్రమించలేదు. ఇందుకు ఐసీసీ అనుమతి కోరాం’ అని తెలిపారు.
(ఇక్కడ చదవండి: ధోనితో ఆ లోగో తీయించండి)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top