హైదరాబాద్‌ థండర్‌బోల్ట్స్‌ ఘనవిజయం

hyderabad thunderbolts beats adilabad tigers - Sakshi

7 వికెట్లతో ఓడిన ఆదిలాబాద్‌ టైగర్స్‌   

రాణించిన జయరామ్, చందన్‌ సహాని  

తెలంగాణ టి20 లీగ్‌  

సాక్షి, హైదరాబాద్‌: జి. వెంకటస్వామి స్మారక తెలంగాణ టి20 క్రికెట్‌ లీగ్‌లో హైదరాబాద్‌ థండర్‌బోల్ట్స్‌ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. జింఖానా మైదానంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఆదిలాబాద్‌ టైగర్స్‌పై ఘనవిజయం సాధించింది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లాడిన హైదరాబాద్‌కు ఇది ఐదో గెలుపు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆదిలాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు సాధించింది. బెంజమిన్‌ (42 బంతుల్లో 45; 4 ఫోర్లు), నీరజ్‌ బిస్త్‌ (29; 3 ఫోర్లు, ఒక సిక్స్‌) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో నీలేశ్‌ 2 వికెట్లు తీశాడు. అనంతరం హైదరాబాద్‌ థండర్‌బోల్ట్స్‌ 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. జయరామ్‌ రెడ్డి (23 బంతుల్లో 53 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ అర్ధసెంచరీతో చెలరేగాడు. చందన్‌ సహాని (33; 5 ఫోర్లు), విఠల్‌ అనురాగ్‌ (33; 1 ఫోర్, 1 సిక్స్‌) దూకుడుగా ఆడారు.  

ఇతర మ్యాచ్‌ల వివరాలు

ఎంఎల్‌ఆర్‌ రాయల్స్‌ మహబూబ్‌నగర్‌: 153/6 (ఠాకూర్‌ తిలక్‌ వర్మ 65; కార్తికేయ 2/25, లలిత్‌ మోహన్‌ 2/42), నల్లగొండ లయన్స్‌: 134/7 (వంశీ రెడ్డి 37, వరుణ్‌ గౌడ్‌ 37; అనికేత్‌ రెడ్డి 2/20, అజయ్‌ దేవ్‌ గౌడ్‌ 2/25). n కాకతీయ కింగ్స్‌: 86 (లలిత్‌ రెడ్డి 3/19, ఆకాశ్‌ భండారి 3/10), నిజామాబాద్‌ నైట్స్‌: 87/1 (ఆకాశ్‌ భండారి 37 నాటౌట్, అనురాగ్‌ హరిదాస్‌ 28 నాటౌట్‌). n రంగారెడ్డి రైజర్స్‌:198/5 (దీపాన్‌‡్ష బుచర్‌ 54, అక్షత్‌ రెడ్డి 52, వినయ్‌ గౌడ్‌ 35; కె. రాజశేఖర్‌ 2/33, త్రిషాంక్‌ గుప్తా 2/33), ఖమ్మం టిరా: 113 (అస్కారి 48, కనిష్క్‌ నాయుడు 2/17, దినేశ్‌ కుమార్‌ 2/13).   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top