పాండ్యా... నీకొచ్చిందేమిటో చెప్పు!

Hardik Pandya slammed as India lose Test series in England - Sakshi

సౌతాంప్టన్‌: ఇంగ్లండ్‌తో జరిగిన నాల్గో టెస్టులో టీమిండియా ఓటమి పాలై సిరీస్‌ను కోల్పోయిన సంగతి తెలిసిందే.  గెలిచే అవకాశం ఉన్న టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘోరంగా విఫలమైందని క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా వైఫల్యంలో హార్దిక్‌ పాండ్యా భాగస్వామ్యమే ఎక్కువగా ఉందని నెటిజన్లు పాండ్యాపై మండిపడుతున్నారు. అసలు టీమిండియాలో అతడిని ఎందుకు ఉంచాలో కారణం చెప్పమంటూ ట్వీట్లు చేస్తున్నారు.

‘డియర్‌ పాండ్యా.. క్రికెట్‌ ఆడటానికి నీకున్న టాలెంట్‌ ఏంటో చెప్పు. బౌలింగ్‌ రాదు.. బ్యాటింగ్‌ చేతకాదు. ఆటకు సంబంధించి నీకున్న బలాల్లో అత్యంత బలమైనది ఏది? అసలు నిన్నెందుకు టీమిండియా ఉండనివ్వాలో ఒక్క కారణం చెప్పు’ అని ఒక అభిమాని విమర్శించగా, ఆరో స్థానంలో బలమైన వ్యక్తి ఉండాలి. కానీ పాండ్యా అందుకు పనికిరాడు. ఈ విషయాన్ని టీమిండియా ఎప్పుడు తెలుసుకుంటుంది?’ అని మరొకరు ప్రశ్నించారు.‘ హార్దిక్‌ బౌలింగ్‌ ఎంచుకుంటే స్టోక్స్‌ పండగ చేసుకుంటాడు. బ్యాటింగ్‌ ఎంచుకుంటే వోక్స్‌ చెలరేగిపోతాడు. అలాంటప్పుడు పాండ్యాను ఆల్‌రౌండర్‌ అని ఎలా అనగలం. టెస్టులో ఉండి పాండ్యా చేసేది ఏముంది’ అని మరొక అభిమాని ఎద్దేవా చేశారు.  ‘ఒకప్పడు ఆరో స్థానంలో లక్ష్మణ్‌లాంటి దిగ్గజ ఆటగాళ్లు ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు ఆస్థానంలో హార్దిక్‌ పాండ్యా ఉన్నాడు. ఆటకు కావల్సింది ప్రతిభ.. ఫ్యాషన్‌కాదు’ అని మరొకరు సెటైర్‌ వేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top