ప్రజ్నేశ్‌ శుభారంభం  | Gunneswaran Off To Good Start In Pune | Sakshi
Sakshi News home page

ప్రజ్నేశ్‌ శుభారంభం 

Feb 5 2020 8:04 AM | Updated on Feb 5 2020 8:04 AM

Gunneswaran Off To Good Start In Pune - Sakshi

పుణే: టాటా ఓపెన్‌ మహారాష్ట్ర ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్‌ ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రజ్నేశ్‌ 7–6 (7/4), 7–6 (7/5)తో యానిక్‌ మాడెన్‌ (జర్మనీ)పై గెలుపొందాడు. మరో తొలి రౌండ్‌ మ్యాచ్‌లో అర్జున్‌ ఖడే (భారత్‌) 2–6, 4–6తో జిరీ వెసిలీ (చెక్‌ రిపబ్లిక్‌) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో లియాండర్‌ పేస్‌ (భారత్‌)–మాథ్యూ ఎబ్డెన్‌ (ఆ్రస్టేలియా) ద్వయం 6–2, 7–6 (7/5)తో రెండో సీడ్‌ దివిజ్‌ శరణ్‌ (భారత్‌)–ఆర్తెమ్‌ సితాక్‌ (న్యూజిలాండ్‌) జోడీపై గెలిచి క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది.  

Advertisement
 
Advertisement
Advertisement