సెంచరీతో ఆకట్టుకున్న గౌతం గంభీర్ | Gautam Gambhir scores century in 2nd innings against Gloucestershire | Sakshi
Sakshi News home page

సెంచరీతో ఆకట్టుకున్న గౌతం గంభీర్

Aug 30 2013 9:20 PM | Updated on Sep 1 2017 10:17 PM

భారత జట్టులో పునరాగమనం కోసం ఎదురు చూస్తున్న గౌతం గంభీర్ కౌంటీ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిపోయాడు.

బ్రిస్టోల్: భారత జట్టులో పునరాగమనం కోసం ఎదురు చూస్తున్న  గౌతం గంభీర్ కౌంటీ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిపోయాడు. గత కొంతకాలంగా జట్టుకు దూరమైన గౌతీ ఇంగ్లిష్ కౌంటీల్లో ఎసెక్స్ తరుపున బరిలోకి దిగాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌ మ్యాచ్‌లో భాగంగా ఎసెక్స్-గ్లోసెష్టైర్‌ల మధ్య జరుగుతున్నసెకెండ్ ఇన్నింగ్స్‌లో అతను సెంచరీతో ఆకట్టుకున్నాడు. 144 బంతులు ఎదుర్కొన్న గౌతం వంద పరుగులు చేసి జట్టు మంచి ఇన్నింగ్స్ చేయడంలో తోడ్పడ్డాడు.
 

ఎసెక్స్ తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌తో పాటు ప్రో 40 మ్యాచ్‌ల్లోనూ బరిలోకి దిగనున్నాడు. న్యూజిలాండ్ ప్లేయర్ హమీష్ రూథర్‌ఫోర్డ్ స్థానంలో అనూహ్యంగా బరిలోకి దిగి తనలో సత్తా చాటలేదని మరోసారి నిరూపించాడు. ఈ సెంచరీతో  గౌతం గంభీర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్  కెరీర్ లో 34 వ సెంచరీ మార్కును చేరుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement