9 సిక్సర్లు.. 5 ఫోర్లు | Evin Lewis' 91 keeps series alive | Sakshi
Sakshi News home page

9 సిక్సర్లు.. 5 ఫోర్లు

Apr 2 2017 3:25 PM | Updated on Sep 5 2017 7:46 AM

9 సిక్సర్లు.. 5 ఫోర్లు

9 సిక్సర్లు.. 5 ఫోర్లు

ట్వంటీ 20 సిరీస్లో భాగంగా పాకిస్తాన్ జరిగిన మూడో ట్వంటీ 20 వెస్టిండీస్ ఓపెనర్ ఎవిన్ లూయిస్ అదుర్స్ అనిపించాడు.

ట్రినిడాడ్: ట్వంటీ 20 సిరీస్లో భాగంగా పాకిస్తాన్ జరిగిన మూడో ట్వంటీ 20 లో వెస్టిండీస్ ఓపెనర్ ఎవిన్ లూయిస్ సూపర్ షో ప్రదర్శించాడు. బౌండరీలే లక్ష్యంగా విరుచుకుపడి పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపెట్టాడు. 51 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లతో 91 పరుగులు సాధించిన లూయిస్.. విండీస్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. లూయిస్ విజృంభణతో మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయిన వెస్టిండీస్ 14.5 ఓవర్లలోనే  లక్ష్యాన్ని అందుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది.  కమ్రాన్ అక్మల్(48), బాబర్ అజమ్(43), ఫకర్ జమాన్(21)లు మాత్రమే రెండెంకల స్కోరును నమోదు చేశారు. మిగతా పాక్ ఆటగాళ్లు నిరాశపరచడంతో ఆ జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఈ మ్యాచ్ లో విజయంతో నాలుగు ట్వంటీ 20 సిరీస్ లో్ ఆశల్ని విండీస్ సజీవంగా నిలుపుకుంది. అంతకుముందు రెండు ట్వంటీ 20లను పాక్ గెలిచిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement