వన్డే సిరీస్ కు టెస్టు జట్టే! | England retain 11 from Test squad for ODIs | Sakshi
Sakshi News home page

వన్డే సిరీస్ కు టెస్టు జట్టే!

Aug 19 2014 5:07 PM | Updated on Sep 2 2017 12:07 PM

టెస్ట్ సిరీస్ లోభారత్ ను ఘోరంగా దెబ్బ తీసిన టెస్టు జట్టునే వన్డేలకు కొనసాగించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది.

లండన్:టెస్ట్ సిరీస్ లోభారత్ ను ఘోరంగా దెబ్బ తీసిన టెస్టు జట్టునే వన్డేలకు కొనసాగించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. భారత్ తో జరిగే వన్డే సిరిస్ కు 15 మంది ఇంగ్లండ్ సభ్యుల బృందంలో 11 మంది టెస్ట్ జట్టులో ఆడిన వారినే తాజాగా ఎంపిక చేసింది. టెస్ట్ జట్టులో ఆడిన వారికి అదనంగా మరో నలుగురిని మాత్రమే వన్డే జట్టకు ఎంపిక చేశారు. వారిలో అలెక్స్ హేల్స్, ఇయాన్ మోర్గాన్, హర్రీ గుర్నీ, జేమ్స్ ట్రేడ్ వెల్ లు తుది జట్టులోకి రానున్నారు.

 

ఇదిలా ఉండగా టెస్ట్ సిరీస్ లో అకట్టుకున్న స్టువార్డ్ బ్రాడ్ మాత్రం వన్డేలకు అందుబాటలో ఉండకపోవచ్చని బోర్డు తెలిపింది. అదే సమయంలో బ్రాడ్ మోకాలికి సర్జరీ చేయించుకోనున్నందున అతను తుది జట్టులో ఉండకపోవచ్చని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement